మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గురువారం కుంకుమ పూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ సభ్యులు మహిళలకు పూజా సామగ్రిని అందజేసి, కుంకుమ పూజ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో సాగిన ఈ కార్యక్రమంతో పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నిర్వాహకులు వై. లక్ష్మారెడ్డి, ఎం. శ్రీను, నాగరాజు, గోపి, బాబి తదితరులతో పాటు స్థానిక మహిళలు, భక్తులు పాల్గొన్నారు.


إرسال تعليق