ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఆశా కార్యకర్త మృతి.. నివాళులర్పించిన వైద్య సిబ్బంది


రూ. 30 వేలు ఆర్థిక సహాయం అందించిన ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది

ప్రజాపక్షం/ ఏన్కూర్: ఏన్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని నాచారం ఆరోగ్య ఉపకేంద్రానికి చెందిన ఆశా కార్యకర్త తాటి రమణ శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె మృతితో కుటుంబ సభ్యులు, తోటి వైద్య సిబ్బంది విషాదంలో మునిగారు. విషయం తెలుసుకున్న ఏన్కూరు పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ బాలకృష్ణ సిబ్బందితో కలిసి రమణ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రమణ కుటుంబానికి మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడంలో ఆశా కార్యకర్తగా తాటి రమణ అందించిన సేవలను వైద్య సిబ్బంది ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఆమె మృతి ఆరోగ్య సిబ్బందికి తీరని లోటని పేర్కొన్నారు. అనంతరం ఆరోగ్య సిబ్బంది ఆశా కార్యకర్తలు కలిసి రూ. 30 వేలను ఆర్థిక సహాయంగా అందించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గొంది వెంకటేశ్వర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم