ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఆరెకోడు తండాలో ఉచిత పశు వైద్య శిబిరం



 ప్రజాపక్షం/ఖమ్మం రూరల్ : ఖమ్మం రూరల్ మండలంలోని ఆరెకోడు తండాలో పశు వైద్య అండ్ పశుసంవర్ధక పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత గర్భ కోసం వ్యాధి నివారణ వైద్య శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. తొలుత ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ బానోతు మంగమ్మతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా పసుపు గణ అభివృద్ధి సంస్థ కార్య నిర్వహణ అధికారి డాక్టర్ కొర్లకుంట కిషోర్ , పశు వైద్యులు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా 22 పశువులకు చూడి పరీక్షలు, గర్భకోశ వ్యాధి నివారణ చికిత్సలు 33 పశువులకు సాధారణ పశువైద్య సేవలు. 8 దూడలకు నట్ట నివారణ మందులు తాగించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనంత హరీష్, ఖమ్మం జిల్లా పశువైద్యశాల ఇంటర్నేషిప్ విద్యార్థినీ- విద్యార్థులు జాహ్నవి, ఆర్యన్, అసితోష్, గోపాలమిత్ర సూపర్వైజర్ నాగేశ్వరరావు, గోపాల మిత్రులు వెంకటేశ్వర్లు, అలీ, శ్రీను, వినయ్, ఈశ్వర్, సందీప్, గ్రామ ఉపసర్పంచ్ బానోతు వాలి, రైతులు పాల్గొన్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم