ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

కూరగాయలు కోస్తున్న భార్యపై.. కత్తిపీటతో దాడి..!


 

కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త ఘాతుకం.. తీవ్ర గాయాలు


పరిస్థితి విషమం.. మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలింపు


ప్రజాపక్షం / నేలకొండపల్లి: కూరగాయలు కోస్తున్న భార్య చేతిలోని కత్తిపీటనే ఆయుధంగా మార్చుకున్న భర్త.. ఆమె మెడపై బలంగా దాడి చేసిన ఘటన నేలకొండపల్లి మండలంలోని పైనంపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన ఈ దాడిలో సిద్ధెల వీరలక్ష్మి (25) తీవ్రంగా గాయపడింది. పరిస్థితి విషమంగా ఉండటంతో నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. స్థానికుల కథనం ప్రకారం.. పైనంపల్లి గ్రామానికి చెందిన సిద్ధెల వీరలక్ష్మికి తిరుమలాయపాలెం మండలం బీరోలు గ్రామానికి చెందిన నరసింహారావుతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ కుటుంబ కలహాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సుమారు పది రోజుల క్రితం వీరలక్ష్మి తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చి పైనంపల్లిలో ఉంటోంది. ఈ క్రమంలో శనివారం నరసింహారావు పైనంపల్లికి వచ్చి భార్యతో ఘర్షణకు దిగినట్లు సమాచారం. మాటామాటా పెరగడంతో ఆగ్రహానికి గురైన అతడు.. వీరలక్ష్మి కూరగాయలు కోస్తుండగా పక్కనే ఉన్న కత్తిపీటను తీసుకుని ఆమె మెడపై బలంగా దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడటంతో కుటుంబ సభ్యులు వెంటనే నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తుండగా, దాడికి పాల్పడిన భర్త నరసింహారావును అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم