ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఎస్సై, డ్రైవర్‌కు మెరుగైన వైద్యం అందించాలి


 

స్తంభాద్రి ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన తుంబూరు దయాకర్ రెడ్డి


ప్రజాపక్షం/ఖమ్మం: తిరుమలాయపాలెం మండలంలో రోడ్డు ప్రమాదానికి గురై ఖమ్మంలోని స్తంభాద్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్సై జగదీష్, డ్రైవర్ రాకేష్‌లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా వైద్యులను అడిగి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఎస్సై జగదీష్ ఆరోగ్యం కుదుటగా ఉన్నప్పటికీ డ్రైవర్ రాకేష్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఇరువురికి అవసరమైన మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని వైద్యులకు సూచించారు. అవసరమైతే రాకేష్‌ను ఉన్నత స్థాయి ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేయాలని కోరారు. అనంతరం రాకేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వైద్య ఖర్చుల విషయంలో ఎంతైనా భరించేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని కుటుంబ సభ్యులకు ధైర్యం కల్పించారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم