![]() |
| మృతి చెందిన రాంబాబు |
![]() |
| తీవ్రంగా గాయపడిన ప్రేమ్ కుమార్ |
ప్రజాపక్షం / ఎర్రుపాలెం: మండల పరిధిలోని బుచ్చిరెడ్డిపాలెం గ్రామం ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కృష్ణాజిల్లా మైలవరం మండలం పుల్లూరు గ్రామానికి చెందిన సగ్గుర్తి రాంబాబు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మరో ద్విచక్ర వాహనంపై ఉన్న కొరకుప్పుల ప్రేమ్‌కుమార్ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఆయన స్వస్థలం ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం కొత్తపల్లి గ్రామంగా తెలిసింది. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


إرسال تعليق