ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

వైరాలో ఘనంగా సేవాలాల్ సేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు



ప్రజాపక్ష /వైరా:
సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు భుక్యా సంజీవ్ నాయక్, రాష్ట్ర అధ్యక్షులు బానోత్ హుస్సేన్ నాయక్ గారి ఆదేశాల మేరకు, ఖమ్మం జిల్లా వైరా మండలం లో సేవాలాల్ సేన 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వైరా మండల కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా సేవాలాల్ సేన ఖమ్మం జిల్లా అధ్యక్షులు భుక్యా నరసింహ నాయక్ పాల్గొన్నారు. ముందుగా శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గారి చిత్రపటానికి పూలమాల వేసి, బంజార జాతి కోసం ఆయన చేసిన సేవలు స్మరించుకున్నారు. అనంతరం సేవాలాల్ సేన జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన జిల్లా ఉప అధ్యక్షులు లకావత్ దేవేందర్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి భుక్యా వినోద్ కుమార్ రాథోడ్, సేవాలాల్ సేన కొణిజర్ల మండల అధ్యక్షులు తేజావత్ సురేష్ నాయక్, వైరా కౌన్సిలర్ ఒండ్రు వరలక్ష్మి శ్యాంబాబు గారు, మాజీ కౌన్సిలర్ గుగులోత్ లక్షిబాయి, మాజీ సర్పంచ్ బానోత్ సక్కు బాయి, కాంగ్రెస్ పార్టీ నాయకులు వాంకుడోత్ భీక్య, గుగులోత్ దుర్గా, బానోత్ వెంకటి, కేలోత్ బుజ్జి, తేజావత్ బాలమ్మ, బానోత్ రాము, తేజావత్ రవి, వైరా మండల కమిటీ సభ్యులు మరియు తదితర నాయకులు పాల్గొన్నారు..

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم