పూలమాలలు, శాలువాలతో సన్మానం.. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు
ప్రజాపక్షం /వైరా: తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు, సీనియర్ రాజకీయ నాయకులు వనమా విశ్వేశ్వరరావు జన్మదిన వేడుకలు వైరాలోని ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య మహాసభ ఖమ్మం జిల్లా ప్రథమ ఉపాధ్యక్షులు నూకల వాసు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు, నాయకులు పాల్గొని వనమా విశ్వేశ్వరరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వనమా విశ్వేశ్వరరావును పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో మరిన్ని సంవత్సరాలు ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు కట్టా కృష్ణార్జునరావు, బాణాల వెంకటేశ్వర్లు, పెరుమాళ్ల కృష్ణమూర్తి, నూకల ప్రసాద్, మద్దెల రవి, కోదుమూరి రవి, వనమ చిన్నీ, కొల్ల రాంబాబు, లాల్ మహమ్మద్, గజ్జల కృష్ణమూర్తి, మిట్టపల్లి సత్యంబాబు, నాళ్ల నాగేశ్వరరావు, నాళ్ల గంగాధర్, మిట్టపల్లి వినోద్ కుమార్, కొణతాలపల్లి సుజిత్, చింతలపూడి వెంకటేశ్వరరావు, వజినేపల్లి చక్రవర్తి, సింగవరపు నరేష్, రాజు, యండ్రపుడి శంకర్,దారా జగన్, భువనగిరి సతీష్ , రంగా రమేష్,తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق