నాయకన్‌గూడెం ఇన్‌ఫాల్ నుంచి రామచంద్రపురం బ్రిడ్జి వరకు పనులు
నెల రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యం
ప్రజా పక్షం కూసుమంచి: మండలంలోని సాగునీటి కాలువల నిర్వహణను మెరుగుపరిచేందుకు నీటిపారుదల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నాయకన్‌గూడెం ఇన్‌ఫాల్ నుంచి రామచంద్రపురం బ్రిడ్జి వరకు సుమారు 2.5 కిలోమీటర్ల మేర కాలువకు ఇరువైపులా పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. ఈ పనులను రూ.14 లక్షల వ్యయంతో చేపడుతున్నట్లు ఐబీ (నీటిపారుదల) శాఖ ఏఈ మీనా తెలిపారు.
కాలువ గట్ల పునరుద్ధరణకు చర్యలు
కాలువకు ఇరువైపులా దెబ్బతిన్న ప్రాంతాలను బాగుచేయడం, గుంతలను పూడ్చడం, అవసరమైన మరమ్మతులు చేపట్టడం వంటి పనులను ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. కాలువ గట్ల పరిస్థితిని మెరుగుపరిచి, వాటి నిర్వహణను పటిష్ఠం చేయడమే ఈ పనుల ప్రధాన ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు.
నెల రోజుల్లో పనులు పూర్తి
ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయని, సుమారు నెల రోజుల్లో వాటిని పూర్తి చేయనున్నట్లు ఏఈ మీనా వెల్లడించారు. ఖమ్మం సబ్ డివిజన్ పరిధిలోని సెక్షన్-1, డివిజన్-2, సబ్ డివిజన్-3కు సంబంధించిన అధికారుల పర్యవేక్షణలో ఈ పనులు జరుగుతున్నట్లు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి