ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

కాంగ్రెస్‌కు కాసవరం సర్పంచ్ షేక్ ఫాతిమాభి రాజీనామా!


 


గ్రామాభివృద్ధికి సొంత పార్టీ నాయకులే అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆవేదన.. సర్పంచ్‌గా కొనసాగుతూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి


ప్రజాపక్షం / ఎర్రుపాలెం : మండల పరిధిలోని కాసవరం గ్రామ సర్పంచ్ షేక్ ఫాతిమాభి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. గ్రామాభివృద్ధి పనులకు సొంత పార్టీకి చెందిన కొందరు నాయకులే అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపిస్తూ శనివారం రాత్రి తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. తమ కుటుంబం గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా కొనసాగుతోందని, గతంలో పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ పార్టీని వీడకుండా కొనసాగామని తెలిపారు. గత గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో గ్రామంలోని అన్ని పార్టీల నాయకులు తనకు మద్దతు తెలిపి ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికయ్యేందుకు సహకరించారని గుర్తుచేశారు. అయితే సర్పంచ్‌గా ఎన్నికైన నాటి నుంచి గ్రామంలోని కొంతమంది కాంగ్రెస్ నాయకులు తనకు సహకరించకపోగా, అభివృద్ధి పనులకు ఆటంకాలు కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఏ అభివృద్ధి పని చేపట్టినా కాంగ్రెస్ పార్టీలోని మరో వర్గం అడ్డుకుంటోందని, గ్రామానికి సంక్షేమ పథకాలు తీసుకురావడంతో పాటు మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి అభివృద్ధి చేయాలనే తన ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతున్నాయని ఆరోపించారు. ఈ విషయాన్ని మండల స్థాయి కాంగ్రెస్ నాయకుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా పట్టించుకోలేదని, మండల కాంగ్రెస్ అధ్యక్షుడి ద్వారా గ్రామస్థాయి నాయకులకు తెలియజేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలనుకుంటున్న తనకు పార్టీలోనే అడ్డంకులు ఎదురవుతుండటంతో తీవ్ర ఆవేదనకు గురై కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే తాను కాంగ్రెస్ పార్టీకి మాత్రమే రాజీనామా చేశానని, సర్పంచ్ పదవికి రాజీనామా చేయలేదని తెలిపారు. అన్ని పార్టీల మద్దతుతో ఏకగ్రీవంగా ఎన్నికైనందున గ్రామ ప్రజలందరినీ కలుపుకొని రాజకీయాలకు అతీతంగా కాసవరం గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని షేక్ ఫాతిమాభి వెల్లడించారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم