బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నుంచి ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి
ప్రజాపక్షం/వైరా: వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటు నమోదు చేసుకునేందుకు వైరాలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పార్టీ నాయకులు తెలిపారు. యూనియన్ బ్యాంక్ ఎదురుగా ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నుంచి పూర్తిస్థాయిలో ఆన్‌లైన్ ద్వారా ఓటు నమోదు చేసుకునే సదుపాయం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలనుకునే అర్హులైన పట్టభద్రులు కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలని కోరారు. గతంలో ఓటరుగా నమోదైన వారు సైతం ప్రస్తుత ఎన్నికల కోసం తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో పరిశీలించుకోవాలని సూచించారు. అవసరమైన సందర్భాల్లో నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని పట్టభద్రులు సద్వినియోగం చేసుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందేలా బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సహకరించాలని పార్టీ వర్గాలు పిలుపునిచ్చాయి.


إرسال تعليق