దసరా పండుగ వేళ బెల్లం వేణుపై అభిమానం చాటుకున్న అభిమాని
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: అభిమానానికి హద్దులుండవు.. తమకు ఇష్టమైన నాయకుడిపై అభిమానులు చూపించే ప్రేమాభిమానాలు ఒక్కోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. అలాంటి అభిమానమే చాటుకున్నాడు ఓ అభిమాని . తన అభిమాన నాయకుడిపై ఉన్న ప్రేమను ఓ అభిమాని ఏకంగా చేతిపై పచ్చబొట్టుగా వేయించుకుని అభిమాన నికి అవధుల్లేవని నిరూపించాడు.
ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డుకు చెందిన ఈటా కిషోర్.. బీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు బెల్లం వేణుపై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా వ్యక్తం చేశాడు. దసరా పండుగ సందర్భంగా తన కుడి చేతిపై బెల్లం వేణు చిత్రాన్ని పచ్చబొట్టుగా వేయించుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. అనంతరం తన అభిమాన నాయకుడిని కలిసి పచ్చబొట్టును చూపిస్తూ ఆనందం వ్యక్తం చేశాడు.ఈ సందర్భంగా గొర్రె నవీన్ ఆధ్వర్యంలో నాయకులను కలిసి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సాధారణంగా అభిమానాన్ని మాటల్లోనో, చేతల్లోనో వ్యక్తం చేయడం చూస్తుంటాం. కానీ, దీంతో అభిమానమే పచ్చబొట్టుగా మారి.. దసరా పండుగ వేళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


إرسال تعليق