ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని జలగంనగర్ 4వ వార్డులో ఆయుధపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాడ్ బెండింగ్ మేస్త్రి మునగాల నాగయ్య (నాని) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వృత్తిపరంగా వినియోగించే పనిముట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా పండుగ సందర్భంగా తమ వృత్తిలో ఉపయోగించే పనిముట్లను దైవస్వరూపంగా భావించి పూజించడం ఆనవాయితీగా వస్తోందని, ఈ సంప్రదాయంలో భాగంగా నాగయ్య తన సహచరులతో కలిసి ఆయుధపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్, మున్సిపాలిటీ నాయకులు బోయిన సాయి, అక్కినేపల్లి దేవయ్య చారి, రెబ్బగొండ్ల గోపీ యాదవ్, మహంకాళి కృష్ణ, నాగ తదితరులు పాల్గొన్నారు.
సాంప్రదాయానికి ప్రత్యేకగా ఆయుధ పూజ.. భక్తిశ్రద్ధల నడుమ...
byThe News Desk
-
0


إرسال تعليق