ప్రజాపక్షం / నేలకొండపల్లి: అంగన్వాడీ కేంద్రాలను ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఐసీడీఎస్ సీడీపీవో కవిత సూచించారు. మండలం లోని రాజేశ్వరపురం లో సోమవారం అంగన్వాడీ కేంద్రంలో గర్భీణీలకు సీమంతాలు నిర్వహించారు. చిన్నారులకు అన్నప్రసన్న వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడారు...అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందించే పౌష్టికాహారం ను పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దండా రంగయ్య. ఉప సర్పంచ్ రాసాల నవీన్, అంగన్వాడీ టీచర్స్ కల్పన, ఉమారాణి, విజయలక్ష్మి, ఉమ తదితరులు పాల్గొన్నారు. మండలం లోని మంగాపురం లో సీమంతాలు. అక్షరాభ్యాసం కార్యక్రమం ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి శ్రావణ్ కుమార్, సర్పంచ్ 'ధీరావత్ అశోక్ రాణి, సూపర్ వైజర్ పార్వతీ తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
byThe News Desk
-
0

కామెంట్‌ను పోస్ట్ చేయండి