ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

కూరాకుల నాగభూషణానికి చంద్రావతి పరామర్శ


 


అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష


ప్రజాపక్షం/ఖమ్మం: అనారోగ్యానికి గురై ప్రస్తుతం కోలుకుంటున్న మాజీ డీసీసీబీ చైర్మన్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు కూరాకుల నాగభూషణాన్ని మాజీ ఎమ్మెల్యే డా. బానోతు చంద్రావతి పరామర్శించారు. ఖమ్మం నగరంలోని ఆయన స్వగృహానికి వెళ్లిన చంద్రావతి, నాగభూషణం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలని, తిరిగి ప్రజాసేవలో చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్షించారు. అనారోగ్యం నుంచి కోలుకుంటున్న ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పరివెంట రాజ్‌కుమార్, ఉద్దండు షమీర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم