ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

భక్తి భావంతో అన్నదానం.. అభినందనీయం



 


మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి


నాలుగో వార్డులో శ్రీ దుర్గా పరమేశ్వర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం


ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: భక్తిశ్రద్ధలతో దుర్గామాత విగ్రహాన్ని ఏర్పాటు చేసి, నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి అన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డులో శ్రీ దుర్గా పరమేశ్వర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ యువజన నాయకుడు బోయిన సాయి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తుంబూరు దయాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆయనను శాలువాతో కమిటీ ఆధ్వర్యంలో సత్కరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని దయాకర్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవరాత్రుల సందర్భంగా భక్తులు ఎంతో నిష్ఠతో అమ్మవారిని ఆరాధించడం, ఉత్సవాలను సామూహికంగా నిర్వహించడం మంచి సంప్రదాయమన్నారు. ఉత్సవాల నిర్వహణలో ప్రజలందరూ భాగస్వాములై పరస్పర సహకారంతో ముందుకు సాగాలని సూచించారు. ఇటువంటి వేడుకలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు ఐక్యత, సోదరభావాన్ని బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. నవరాత్రులను ఎంతటి భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారో, నిమజ్జన కార్యక్రమాన్ని కూడా అదే స్ఫూర్తితో ప్రశాంత వాతావరణంలో, నిబంధనలకు అనుగుణంగా జరుపుకోవాలని కమిటీ సభ్యులకు సూచించారు.ఉత్సవాల విజయవంతానికి కృషి చేస్తూ, ప్రజలను సమన్వయం చేసుకుంటూ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన బోయిన సాయి యాదవ్‌ను ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కౌన్సిలర్ బోయిన కుమారి, కాంగ్రెస్ నాయకుడు బోయిన సంగయ్య, ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم