ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఖమ్మం రూరల్‌ రోడ్లపై బైక్‌ స్టంట్లకు పోలీసుల చెక్‌.. డిగ్రీ విద్యార్థిపై కేసు నమోదు


 

యువత సరదా కోసం ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టొద్దు.. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు: సీఐ ముష్క రాజు


ప్రజాపక్షం/ఖమ్మం రూరల్‌: రోడ్లపై ప్రమాదకర బైక్‌ స్టంట్లు చేస్తూ ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించే యువతపై ఖమ్మం రూరల్‌ పోలీసులు నిఘా పెంచారు. పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌ దత్‌ ఆదేశాల మేరకు ప్రమాదకర బైక్‌ విన్యాసాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఖమ్మం రూరల్‌ మండలం వెంకటగిరి గ్రామానికి చెందిన డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థి ఐతగాని అజయ్‌కుమార్‌ (20)పై శనివారం కేసు నమోదు చేసినట్లు ఖమ్మం రూరల్‌ సీఐ ముష్క రాజు తెలిపారు. రోడ్లు ప్రజలందరి ప్రయాణానికి ఉపయోగపడే మార్గాలని, వాటిపై ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ఇతర వాహనదారులు, పాదచారుల భద్రతను ప్రమాదంలోకి నెట్టడం సరికాదని ఆయన పేర్కొన్నారు. బైక్‌ స్టంట్లపై నిఘా విభాగంతో పాటు పోలీస్‌ శాఖలోని వివిధ విభాగాలు పర్యవేక్షణ చేపట్టినట్లు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రమాదకరంగా బైక్‌ విన్యాసాలు చేస్తూ పట్టుబడితే సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. యువత క్షణిక సరదా కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, తమతో పాటు రోడ్డుపై ప్రయాణించే ఇతరుల భద్రతను కూడా దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, బైక్‌ స్టంట్లను ప్రోత్సహించడం, వాటి కోసం రోడ్లను వేదికగా మార్చడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సీఐ ముష్క రాజు హెచ్చరించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే చర్యలపై పోలీసుల నిఘా కొనసాగుతుందని తెలిపారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم