ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటును నమోదు చేసుకున్న తాటి రవికుమార్


 


ప్రజాపక్షం/దమ్మపేట: అశ్వారావుపేట, బూర్గంపహాడ్ మాజీ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర మాజీ తొలి ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు కుమారుడు తాటి రవికుమార్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం తన ఓటును నమోదు చేసుకున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి అర్హులైన ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఎంతో కీలకమైందని, పట్టభద్రులు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం ద్వారా సమర్థవంతమైన ప్రజాప్రతినిధుల ఎంపికలో భాగస్వాములు కావచ్చని పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులు ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన పెంచుకోవాలని, నిర్ణీత గడువులోగా అవసరమైన పత్రాలతో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతి పట్టభద్రుడు ఓటరు నమోదు ప్రక్రియలో భాగస్వామి కావడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయవచ్చని తెలిపారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم