ప్రజాపక్షం / నేలకొండపల్లి: ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరిలో నిర్వహించిన 17వ జాతీయ ఆహ్వానిత జపాన్ షిటో-ర్యూ కరాటే ఛాంపియన్ లీగ్లో నేలకొండపల్లి మండలం కొత్తకొత్తూరు గ్రామంలోని సెయింట్ ఫ్రాన్సిస్ హైస్కూల్ విద్యార్థులు వివిధ విభాగాల్లో ప్రతిభ చాటి పతకాలు సాధించారు. ఈ పోటీల్లో నోహిత బంగారు పతకం సాధించగా, కృతిక్ చంద్ర రజత పతకం, భరత్ కాంస్య పతకం సాధించారు. జాతీయ స్థాయి కరాటే పోటీల్లో విద్యార్థులు ప్రతిభ కనబరిచి పతకాలు సాధించడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. పతకాలు సాధించిన విద్యార్థులను పోటీల ప్రధాన నిర్వాహకులు, జపాన్ షిటో-ర్యూ కరాటే సంఘం ప్రధాన కార్యదర్శి షిహాన్ డి. ప్రభాకర్ అభినందించారు. అనంతరం విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, పతకాలను అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా సెయింట్ ఫ్రాన్సిస్ హైస్కూల్ ప్రిన్సిపాల్ మిక్కిలి జోసెఫ్, కరాటే మాస్టర్ మాధవీలత విద్యార్థులను అభినందించి, భవిష్యత్తులో మరిన్ని జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
జాతీయ కరాటే పోటీల్లో సత్తాచాటిన సెయింట్ ఫ్రాన్సిస్ విద్యార్థులు
byThe News Desk
-
0

إرسال تعليق