సీఎంఆర్ఎఫ్ సాయం అందేలా సీపీఐ చొరవ
అర్హులకు ప్రభుత్వ పథకాలు చేరే వరకు పోరాటం
ప్రజాపక్షం/ఖమ్మంరూరల్: బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను అర్హులకు అందించడంలో సీపీఐ ముందుండి పనిచేస్తోందని 28వ వార్డు సీపీఐ కౌన్సిలర్ దండి రంగారావు అన్నారు . ప్రజలు తమ సమస్యలతో పార్టీని ఆశ్రయించిన వెంటనే స్పందించి, ప్రభుత్వ స్థాయిలో అవసరమైన సిఫారసులు, సహాయ సహకారాలు అందేలా సీపీఐ నాయకత్వం చొరవ తీసుకుంటోందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందిన పూజిత కుటుంబానికి రూ.21 వేలు, చింతల మాధవికి రూ.60 వేల రూపాయల విలువ గల సీఎంఆర్ఎఫ్ ఆర్థిక సహాయం మంజూరైంది. ఈ సహాయం అందేలా సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ ప్రత్యేకంగా చొరవ తీసుకుని సహకరించగా, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సిఫారసుతో సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరైనట్లు నాయకులు తెలిపారు. మంజూరైన చెక్కును సీపీఐ మున్సిపాలిటీ నాయకులు బాధిత కుటుంబం వద్దకు స్వయంగా వెళ్లి మంగళవారం అందజేశారు. కేవలం చెక్కు అందించడమే కాకుండా, బాధిత కుటుంబం పరిస్థితిని అడిగి తెలుసుకుని వారికి ధైర్యం చెప్పడం ద్వారా సీపీఐ ప్రజలకు అండగా నిలిచింది.ప్రజా సమస్య వచ్చినప్పుడు స్పందించడం, ప్రభుత్వ సహాయం అందే వరకు సంబంధిత అధికారులను సంప్రదించడం, అర్హులకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడం ఇదే సీపీఐ ప్రజా సేవా విధానమని నాయకులు తెలిపారు. భవిష్యత్తులోనూ బాధితులు, పేదలు, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా సీపీఐ నిరంతరం ప్రజల తరఫున నిలబడి కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మున్సిపాలిటీ నాయకులు సైదిరెడ్డి సురేందర్. శ్రీనివాస్ రెడ్డి , కృపాకర్ కోటి, సన్నీ ఉదయ్ రోనాక్, రుతిక్, పవన్, సందీప్ , చింతల ఉదయ్, మధు, ఉమేష్, ప్రశాంత్, రాము, రమేష్, నవీన్, అభి తదితరులు పాల్గొన్నారు


إرسال تعليق