నాయుడుపేట సర్కిల్, కోదాడ ఎక్స్ రోడ్, వెంకటగిరి ఎక్స్ రోడ్లలో సుందరీకరణ పనుల పరిశీలన
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఎదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే లక్ష్యంతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చైర్పర్సన్ పోకబత్తిని అనిత అన్నారు. శనివారం ఎదులాపురం మున్సిపాలిటీలోని నాయుడుపేట సర్కిల్, కోదాడ ఎక్స్ రోడ్, వెంకటగిరి ఎక్స్ రోడ్లలో సుందరీకరణ పనులను కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని సమీక్షించి, అభివృద్ధి కార్యక్రమాలు నాణ్యతా ప్రమాణాలతో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం, పరిశుభ్రమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడం, ప్రధాన కూడళ్లను సుందరంగా తీర్చిదిద్దడం ద్వారా పట్టణానికి కొత్త రూపు తీసుకురావడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అన్నారు. మంత్రి క్యాంపు కార్యాలయ ఇంచార్జ్ తుంబురు దయాకర్ రెడ్డి మార్గదర్శకత్వంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా మారబోతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ అప్పారావు, కాంగ్రెస్ కౌన్సిలర్లు సోము వెంకటరెడ్డి, బుర్ర మహేష్, కడవ నవీన్, బానోతు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

إرسال تعليق