ఎదులాపురం మున్సిపాలిటీ వాసుల ఆధ్వర్యంలో 69వ జన్మదిన వేడుకలు
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: సమాజమే కుటుంబంగా భావిస్తూ, సేవే పరమావధిగా ముందుకు సాగుతున్న ప్రముఖ మానవతా మూర్తి, అన్నం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అన్నం శ్రీనివాసరావు 69వ జన్మదిన వేడుకలను ఎదులాపురం మున్సిపాలిటీ వాసులు బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఆయన అందిస్తున్న సేవలను గుర్తించి ఫౌండేషన్ కార్యాలయంలో కేక్ కట్ చేపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంచికి చిహ్నంగా ఒక ఫొటోను బహూకరించి ఆయనపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా అన్నం శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మున్సిపాలిటీ వాసులు తన సేవలను గుర్తించి జన్మదిన వేడుకలు నిర్వహించడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందన్నారు. తనపై అభిమానం చూపుతూ వేడుకలు నిర్వహించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నారపాటి రవికుమార్, అనుముల విజయేందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, నంద్యాల శ్రీనివాసరావు, పొందూరు నాగేశ్వరరావు, ఫారెస్ట్ డీఆర్ఓ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق