ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

వైరా కేవీకేలో ఘనంగా అంతర్జాతీయ మహిళా రైతుల దినోత్సవం



 

వ్యవసాయ అభివృద్ధిలో మహిళా రైతుల పాత్ర అమూల్యం :కేవీకే హెడ్ డా. టి. పావని


ప్రజాపక్షం/ వైరా: వ్యవసాయ రంగంలో మహిళా రైతుల కృషి అమూల్యమని, వారి భాగస్వామ్యంతోనే సుస్థిర వ్యవసాయ అభివృద్ధి సాధ్యమవుతుందని వైరా కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డా. టి. పావని అన్నారు. అంతర్జాతీయ మహిళా రైతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా వైరాలోని కేవీకే ఆధ్వర్యంలో మహిళా రైతుల ప్రాధాన్యతను చాటిచెబుతూ ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.


వ్యవసాయంలో ప్రతి అడుగులోనూ మహిళలదే కీలక పాత్ర


ఈ సందర్భంగా డా. టి. పావని మాట్లాడుతూ.. విత్తనం నాటడం నుంచి పంటల సాగు, కలుపు నివారణ, పంటల సంరక్షణ, కోత, పంట అనంతర నిర్వహణ, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ వరకు వ్యవసాయంలోని ప్రతి దశలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. మహిళా రైతుల శ్రమ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలాన్నివ్వడంతో పాటు కుటుంబాల ఆహార భద్రత, పోషకాహారం, జీవనోపాధి మెరుగుదలకు దోహదపడుతోందని పేర్కొన్నారు.


ఆధునిక సాంకేతికతపై అవగాహన అవసరం


మహిళా రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ సాగు పద్ధతులు, సేంద్రియ వ్యవసాయం, పంటల వైవిధ్యీకరణ, ప్రకృతి వనరుల సంరక్షణ, పంట అనంతర సాంకేతికతలు, విలువ జోడింపు, మార్కెటింగ్‌పై అవగాహన కల్పించాలని సూచించారు. దీనివల్ల మహిళా రైతులు ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు వ్యవసాయ పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అవకాశాలు పెరుగుతాయని వివరించారు.

*మహిళా రైతులతో ముఖాముఖి*

కార్యక్రమంలో భాగంగా ప్రగతిశీల మహిళా రైతులతో కేవీకే శాస్త్రవేత్తలు పరస్పర చర్చలు నిర్వహించారు. వ్యవసాయంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు, అనుసరిస్తున్న వినూత్న సాగు పద్ధతులు, సాధిస్తున్న విజయాలపై చర్చించారు. మహిళా రైతుల అనుభవాలు ఇతర రైతులకు స్ఫూర్తినిస్తాయని, వారి విజయగాథలు మరింత మంది మహిళలను వ్యవసాయ రంగంలో ముందుకు నడిపిస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్త డా. ఫణితో పాటు ఇతర శాస్త్రవేత్తలు, సిబ్బంది పాల్గొన్నారు. మహిళా రైతుల సంక్షేమం, సాధికారత, సాంకేతిక పరిజ్ఞాన విస్తరణకు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.మహిళా రైతుల శ్రమకు గుర్తింపు, వారి నైపుణ్యాలకు ప్రోత్సాహం, ఆర్థిక సాధికారతకు సహకారం అందించినప్పుడే వ్యవసాయ రంగం మరింత అభివృద్ధి చెందుతుందనే సందేశంతో కార్యక్రమం ముగిసింది.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم