ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

మానవత్వం చాటుకున్న వెంపటి జీవనజ్యోతి





 

 రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి రక్తంలో కొట్టుమిట్టాడుతుండగా సహాయకరంగా సేవలు


యువ డాక్టర్ మానవత్వాన్ని కొనియాడిన అక్కడి ప్రజలు


ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: రోడ్డు ప్రమాదం సంభవించినప్పుడు సహజంగా ఎవరైనా తక్షణమే అక్కడికి వెళ్లి వారికి వైద్య సేవలు అందించేలా తోడ్పాటును అందించే ప్రయత్నం చేస్తారు. అలాగే ధైర్యంగా ఉండాలని ఎటువంటి ప్రమాదం జరగదు అనే భరోసాను కల్పిస్తారు. కానీ ఓ యువ డాక్టర్ గాయపడి రక్త మోడుతున్న వ్యక్తిని తన చేతులతో అక్కున చేర్చుకుని ధైర్యం ఇచ్చిన తీరు ప్రశంసనీయంగా మారింది.



ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఖమ్మం వరంగల్ బైపాస్ రోడ్డు సమీపంలోని లక్ష్మీ బృందావనం వద్ద ఆటో కారు ఢీకొని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఆటోలో ప్రయాణిస్తున్న పిల్లలు పెద్దవాళ్లకు ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో తన తండ్రి సిపిఐ జిల్లా సమితి సభ్యుడు వెంపటి సురేంద్ర తో కలిసి వెళుతున్న డాక్టర్ వెంపటి జీవనజ్యోతి ఆ ఘటనను చూసి చలించిపోయింది. వెంటనే క్షతగతులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని వారికి భరోసా కల్పించడంతోపాటు వైద్య చికిత్స కోసం ఖమ్మం తరలించడంలో కృషి చేసింది. ఈ సందర్భంగా ఆ యువ డాక్టర్ చూపిన మానవత్వానిపై అక్కడే ఉన్న ప్రజలు అభినందించారు. అలాగే ఈ నేపథ్యంలో అటుగా వెళుతున్న సిపిఐ అనుబంధ సంఘమైన రైతు సంఘం నాయకులు మెడకనిచ్చిన వెంకటరెడ్డి రామకోటి వెన్నం భాస్కర్ తోపాటు కాంగ్రెస్ టిఆర్ఎస్ నాయకులు కూడా క్షతగ్రతలకు సహాయార్థంగా నిలవడం ఆదర్శంగా నిలిచింది. ప్రమాద సమయంలో స్పందించి బాధితులకు అండగా నిలిచిన డాక్టర్ వెంపటి జీవనజ్యోతితో పాటు సహాయం అందించిన నాయకుల తీరుపై స్థానికులు అభినందనలు వ్యక్తం చేశారు. కష్టంలో ఉన్న మనిషికి ధైర్యం చెప్పడం, అవసరమైన సమయంలో తోడుగా నిలవడమే నిజమైన మానవత్వమని ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.




إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم