ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

పోషకాహార మాసంలో పౌష్టికాహారం తప్పనిసరి


 

గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు సమతుల్య ఆహారం తీసుకోవాలి

ప్రజాపక్షం /నేలకొండపల్లి: పోషకాహార మాసాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ పౌష్టికాహారంపై అవగాహన పెంచుకుని, సమతుల్య ఆహారం తీసుకోవాలని కోరుట్లగూడెం అంగన్వాడీ టీచర్ బచ్చలకూరి నిర్మల సూచించారు. గురువారం అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు రోజువారీ ఆహారంలో పోషక విలువలు కలిగిన పదార్థాలను చేర్చుకోవాలని తెలిపారు. పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించవచ్చన్నారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పౌష్టికాహారం ఎంతో అవసరమని, తల్లిదండ్రులు పిల్లల ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులు, తల్లులకు పోషకాహారం ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అంగన్వాడీ ఆయా, గ్రామ పెద్దలు, చిన్నారులు, తల్లులు పాల్గొన్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم