ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఆర్టీసీ కండక్టర్‌ను బస్సులో నుంచి నెట్టివేసిన మహిళ అరెస్ట్


 

టికెట్‌ విషయంలో వివాదం.. రోడ్డుపై పడిన కండక్టర్‌పై నుంచి వెళ్లిన బస్సు


ప్రజాపక్షం/భద్రాద్రి కొత్తగూడెం: ఆర్టీసీ బస్సులో టికెట్‌ విషయంలో తలెత్తిన వివాదం తీవ్ర ఘటనకు దారితీసింది. మహిళా ప్రయాణికురాలు బస్సు కండక్టర్‌ను కిందకు నెట్టివేయడంతో, ఆమెపై నుంచి బస్సు వెళ్లి కండక్టర్‌ కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు.పోలీసుల వివరాల ప్రకారం.. ఆదివారం ఆర్టీసీ బస్సులో టికెట్‌ తీసుకునే విషయంలో మహిళా ప్రయాణికురాలు, కండక్టర్‌ మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో మిట్టగూడెం సమీపంలో సదరు మహిళ కండక్టర్‌ను బస్సులో నుంచి కిందకు నెట్టివేసింది. దీంతో రోడ్డుపై పడిపోయిన కండక్టర్‌ కాళ్లపై నుంచి బస్సు వెళ్లడంతో తీవ్ర రక్తగాయాలయ్యాయి.ఈ ఘటనపై బస్సు డ్రైవర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అశ్వాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా మిట్టగూడెం గ్రామానికి చెందిన బానోత్‌ మౌనికను సోమవారం అరెస్టు చేసి మణుగూరు కోర్టులో హాజరుపరిచినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు డీఎస్పీ కార్యాలయం విడుదల చేసిన ఓ ప్రకటనలో  పేర్కొన్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم