మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కలయిక
ప్రజాపక్షం / ఖమ్మం రూరల్: ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న రామ్‌రెడ్డి సర్వోత్తమ్‌రెడ్డిని కాంగ్రెస్ యువజన నాయకుడు ఏనుగు మహేష్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఎన్నికల సమావేశంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో, పార్టీ విజయానికి కీలకంగా పనిచేయాలని సర్వోత్తమ్‌రెడ్డి కోరినట్లు ఏనుగు మహేష్ తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారథ్యంలో పార్టీ విజయానికి తన వంతు కృషి చేస్తానని మహేష్ పేర్కొన్నట్లు వెల్లడించారు.

إرسال تعليق