విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలు, స్టార్టప్ దృక్పథాన్ని పెంపొందించడమే లక్ష్యం: చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్
ప్రజాపక్షం/ ఖమ్మం రూరల్: విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలతో పాటు సృజనాత్మక ఆలోచనా విధానం, ఆవిష్కరణలు, స్టార్టప్‌లపై ఆసక్తిని పెంపొందించే లక్ష్యంతో ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లు పంచాయతీ పరిధిలోని శ్రీ చైతన్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్‌లో ఐఐటీ బాంబే ఆధ్వర్యంలో గురువారం ఇన్నోవేషన్ వర్క్‌షాప్ నిర్వహించారు. తొలుత ఏర్పాటు చేసిన జ్యోతిని కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి గీతిక ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ మాట్లాడుతూ.. ఐఐటీ బాంబే ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఇన్నోవేషన్ సెల్ ఏర్పాటుకు ఎంపికైన 15 కళాశాలల్లో శ్రీ చైతన్య చోటు దక్కించుకోవడం గర్వకారణమన్నారు. కళాశాలకు మెంటార్‌గా ఐఐటీ బాంబే ఎలక్ట్రికల్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ధనలక్ష్మి గోపాల్ నియమితులయ్యారని తెలిపారు. ఇన్నోవేషన్ సెల్ ద్వారా విద్యార్థులు సమాజంలోని సమస్యలను గుర్తించి, వాటికి సాంకేతిక పరిష్కారాలను రూపొందించేలా ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు. అకడమిక్ విద్యతో పాటు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐఐటీ బాంబే ప్రతినిధి షేక్ సాహిల్ జమీల్ మాట్లాడుతూ.. విద్యార్థులకు స్టార్టప్‌లు, ఇన్నోవేషన్ సెంటర్లు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌పై అవగాహన కల్పించడంతో పాటు, భవిష్యత్‌లో సొంత స్టార్టప్‌లను ప్రారంభించే స్థాయికి ఎదగడానికి అవసరమైన మార్గదర్శకత్వం అందిస్తామని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్‌కు ఇలాంటి వర్క్‌షాప్‌లు ఎంతో ఉపయోగకరమన్నారు.ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సాయి గీతిక మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ విద్యాసంస్థలు, పరిశ్రమల సహకారంతో మరిన్ని నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులను భవిష్యత్ సాంకేతిక రంగానికి సిద్ధం చేయడంలో శ్రీ చైతన్య మరో ముందడుగు వేసిందన్నారు.ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకట చలపతి మాట్లాడుతూ.. ప్రస్తుత సాంకేతిక రంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలు, ఆధునిక సాంకేతికత వినియోగం, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలపై నిపుణులు విద్యార్థులకు అవగాహన కల్పించారని తెలిపారు. ఐఐటీ బాంబే వంటి ప్రతిష్ఠాత్మక సంస్థతో అనుసంధానం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక శిక్షణ అందించడం
అభినందనీయమన్నారు.ఎలక్ట్రికల్ విభాగం అధిపతి కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. ఇలాంటి వర్క్‌షాప్‌లు విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సృజనాత్మక ఆలోచనా విధానాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీన్ అకాడమిక్స్ డాక్టర్ సుదర్శన్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వైశాలి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ కిషోర్, ట్రైనింగ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ డాక్టర్ రాజేష్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ హెడ్ డాక్టర్ మురళీమోహన్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.




إرسال تعليق