సీపీఐ మండల కార్యదర్శి యామాల గోపాలరావు పిలుపు
ప్రజాపక్షం/ వైరా: ఖమ్మంలో నేడు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించనున్న ర్యాలీని జయప్రదం చేయాలని సీపీఐ మండల కార్యదర్శి యామాల గోపాలరావు పిలుపునిచ్చారు. భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వ్యవహార శైలిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల ప్రక్రియను తప్పుడు మార్గంలోకి తీసుకెళ్లే విధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలతో పాటు, పెద్ద ఎత్తున ఓట్లను రద్దు చేయడాన్ని నిరసిస్తూ అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు గోపాలరావు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు రక్షణ కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

إرسال تعليق