యశోదమ్మ పార్థివ దేహానికి కాంగ్రెస్ జెండా కప్పి పూలమాలలతో నివాళులర్పించిన మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని నాలుగోవ వార్డు జలగంనగర్కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు సంగిశెట్టి యశోదమ్మ (68) గుండెపోటుతో తన నివాసంలో మృతి చెందారు. ఆమె మరణవార్త తెలుసుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి యశోదమ్మ పార్థివ దేహానికి కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు.యశోదమ్మ మృతి కుటుంబ సభ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని తుంబూరు దయాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని భరోసా కల్పించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. నివాళులర్పించిన వారిలో సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, సుడా చైర్మన్ పువ్వాల దుర్గా ప్రసాద్, ఏదులాపురం మున్సిపాలిటీ చైర్పర్సన్ పోకబత్తిని అనిత, మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బానోత్ కిషోర్ నాయక్, కౌన్సిలర్లు బోయిన కుమారి, సంగయ్య, బానోత్ దివ్య, పుల్చంద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ధరావత్ రామ్మూర్తి నాయక్, మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు వెంకటనారాయణ, బోయిన సంగయ్య , బోయిన సాయి, తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.


إرسال تعليق