ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

సామాజిక న్యాయం, కులగణన కాంగ్రెస్ మాటలకే పరిమితం!


 


రెండు ఎమ్మెల్సీ సీట్లు రెడ్లకేనా?


బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం ఎక్కడ?: ఆకెన పవన్


ప్రజాపక్షం/బోనకల్: సామాజిక న్యాయం, కులగణన అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు ఆచరణలో కనిపించడం లేదని బీసీ హక్కుల సాధన సమితి జిల్లా సహాయ కార్యదర్శి ఆకెన పవన్ విమర్శించారు. తెలంగాణలోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను ఒకే సామాజిక వర్గానికి కేటాయించడం ఏ విధమైన సామాజిక న్యాయమని ప్రశ్నించారు. బీసీల జనాభా దామాషా ప్రకారం రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం, పదవుల భర్తీలోనూ అదే విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చి.. పదవుల్లో మాత్రం అన్యాయమా? అని ప్రశ్నించారు. కులగణనను కేవలం ప్రకటనలకే పరిమితం చేయకుండా, బీసీలకు చట్టసభలు, స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో సముచిత వాటా కల్పించాలని కోరారు. బీసీలకు న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆకెన పవన్ స్పష్టం చేశారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم