విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి : కె.రవిబాబు
ప్రజాపక్షం /నేలకొండపల్లి: విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి, మండల స్పెషల్ ఆఫీసర్ కె.రవిబాబు సూచించారు. గురువారం నాచేపల్లి ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఆయన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. భోజన నాణ్యత, నిత్యావసర సరుకులు, కూరగాయలను తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి విద్యా ప్రగతిని తెలుసుకున్నారు. పాఠశాలకు టాయిలెట్లు, ప్రహరీగోడ, డైనింగ్ హాలు అవసరమని సిబ్బంది ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రవిబాబు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఎం.యర్రయ్య, సర్పంచ్ భూక్యా మౌనిక, ఉపాద్యాయులు, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق