ఇంటింటికి వైద్యశాల కు వెళ్లి భరోసా కల్పించిన బీఆర్ఎస్ నేతలు
తన వంతు ఆర్థిక సాయం అందించిన కందాళ
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో ఆటోలో ప్రయాణం చేస్తున్న ఖమ్మం రూరల్ మండలం కామంచికల్లు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు తీవ్ర గాయాల పాలైన సంగతి తెలిసింది. ఈ ప్రమాదంలో ఒక మహిళా దొంతుసరపు భారతమ్మ అక్కడికక్కడే మృతి చెందిన సంగతి విధితమే. దీంతో అదే రోజు స్పందించిన మాజీ ఎమ్మెల్యే కందాల స్వయంగా బాధిత కుటుంబాలకు ఫోన్ చేసి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తక్షణ వైద్య సహాయం అందేలా చూడాలని బీఆర్ఎస్ నేతలను పురమాయించారు. ఆదివారం మండల పర్యటనలో భాగంగా సాయంత్రం కామంచికల్ గ్రామంలో పార్టీ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, స్థానిక గ్రామ సర్పంచ్ బొప్పీ ప్రభాకర్, పార్టీ నాయకులతో కలిసి విస్తృతంగా పర్యటించిన కందాల గాయపడిన వ్యవసాయ కూలీలు ఇంటింటికి వెళ్లారు. తీవ్రంగా గాయపడి ఇంటి వద్ద చికిత్స తీసుకుంటున్నకోళ్ల లక్ష్మి, ఉమారాణి, యాసారపు ధనలక్ష్మి, బొమ్మగాని నారమ్మ, మాదాసు రమణ, కొంపల్లి మంగమ్మ, మిర్యాల కమలమ్మ, గుండు వీరలక్ష్మి, ఎర్రసంగి పార్వతి, రమణ, కాశీ లక్ష్మి, రాములమ్మ ఇండ్లకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరు, ప్రస్తుత పరిస్థితులను గూర్చి హరా తీశారు. బాధితులకు తన వంతుగా ఆర్థిక సహాయం అందజేశారు. అదేవిధంగా ఖమ్మం నగరంలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స తీసుకుంటున్న మిగిలిన బాధితులను పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని స్థానిక వైద్యారోగ్య సిబ్బందికి సూచించారు. తాను, బీ ఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని అధైర్య పడవద్దు అని భరోసా కల్పించారు. ఇదే ప్రమాదంలో మరణించిన దొంతుసరపు భారతమ్మ ఇంటికి వెళ్లిన కందాల, నాయకులు మృతురాలి చిత్రపటం వద్ద పూలమాల ఉంచి, నివాళులర్పించారు, మృతురాలి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపి, ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి ఎండపల్లి వరప్రసాద్, సొసైటీ చైర్మన్ జరుపుల లక్ష్మణ్ నాయక్, డైరెక్టర్ మేదరమెట్ల శ్రీనివాస్, ముత్యం కృష్ణారావు, బానోతు కృష్ణ, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు జంగాల ఉపేందర్, పార్టీ గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


إرسال تعليق