ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఘనంగా శ్రీ కృష్ణ సేవా ఫౌండేషన్ అనాథ ఆశ్రమం ప్రారంభం


  


అనాథలు, అభాగ్యులకు అండగా నిలవడమే లక్ష్యం: చైర్మన్ డాక్టర్ పాలకుర్తి కృష్ణ


ప్రజాపక్షం/ఖమ్మంరూరల్: సమాజ సేవ, దానధర్మాలే ధ్యేయంగా సాయి గణేష్ నగర్ రోడ్ నంబర్ 12లో ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణ సేవా ఫౌండేషన్ అనాథ ఆశ్రమాన్ని ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ పాలకుర్తి కృష్ణ ఆధ్వర్యంలో స్థానిక కాళీకామాత ఆలయం వద్ద నిర్వహించిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, ఫౌండేషన్ సభ్యులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ పాలకుర్తి కృష్ణ మాట్లాడుతూ.. వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చి మతిస్థిమితం కోల్పోయి, కనీసం తాగునీరు, ఆహారం కూడా అందక మురికి కాలువల వద్ద దుర్భర జీవితం గడుపుతున్న అనాథలు, అభాగ్యులకు ఆశ్రమం ఆశ్రయం కల్పిస్తుందని తెలిపారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థ సేవా భావంతో ఫౌండేషన్ పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రజల్లో మానవత్వం, సేవాభావం పెంపొందించాలని, మదర్ థెరిసా వంటి మహనీయులను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ సామాజిక సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనాథలు, అభాగ్యులు లేని జిల్లాగా ఖమ్మంను తీర్చిదిద్ది తెలంగాణలోనే ఆదర్శ జిల్లాగా నిలపాలన్నదే తమ ఆశయమని ఆకాంక్షించారు. ఎక్కడైనా అనాథలు, ఆపన్న స్థితిలో ఉన్నవారు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించి, వారి సహకారంతో ఫౌండేషన్ ఆశ్రమానికి చేర్చాలని కోరారు. సమాజంలోని పేదలు, నిరుపేదలు, అనాథలు, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే ఫౌండేషన్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. రాబోయే రోజుల్లో సామాజిక, వైద్య, విద్యా రంగాలకు సంబంధించిన అనేక సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ గౌరవ సలహాదారు పాలకుర్తి జ్యోతి, వైస్ ప్రెసిడెంట్ పుట్టపర్తి నర్సింహారావు, కార్యదర్శి మచ్చా శ్రీదేవి, మచ్చా రవి, కోశాధికారి పాలకుర్తి మనీషా, సామాజిక సేవకులు మంద వెంకటేశ్వర్లు, సభ్యులు పొందూరి నాగమణి, బోయినపల్లి కోఠి రెడ్డి, సీనియర్ న్యాయవాది గౌరిచెట్టి గోవర్ధన్, మొగిలి నాగేశ్వరరావు, భక్తి గాయకులు రాయల నాగసాయి, బాబా వీరా అవుతార్ అవులీయా, అధ్యక్షులు శ్రీరాం, మతగాని దాసు తదితరులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన డాక్టర్ పాలకుర్తి కృష్ణను పలువురు అభినందించారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم