ఇంటింటికీ వెళ్లి ఓటు నమోదు చేయిస్తున్న కాంగ్రెస్ నాయకులు
ప్రజాపక్షం/ ఖమ్మం రూరల్: రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, క్యాంపు కార్యాలయ ఇన్చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఆదేశాలు, వార్డు కౌన్సిలర్ సూచనల మేరకు ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డులో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేశారు. రెండో వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏనుగు మహేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఇంటింటికీ వెళ్లి పట్టభద్రుల ఓటు నమోదుపై అవగాహన కల్పిస్తూ, అర్హులైన పట్టభద్రులతో ఆదివారం ఓటు నమోదు చేయించారు. ఈ సందర్భంగా పట్టభద్రులందరూ ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తించి, నిర్ణీత గడువులోగా తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలకుర్తి రామారావు, దోసపాటి లింగయ్య, కందుల బాబు, వల్లెబోయిన శ్రీను, రమేష్, వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق