ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఖమ్మం రూరల్‌లో జీపీఓల ఇష్టారాజ్యం!


 

ప్రజలకు అందని ప్రభుత్వ సేవలు

సర్టిఫికెట్ల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు

ఫోన్ చేసినా స్పందన కరువు..

విధుల నిర్వహణలో నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలంలో కొందరు గ్రామపంచాయతీ అధికారుల (జీపీఓల) పనితీరుపై ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ సేవలను సకాలంలో అందించాల్సిన అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. విధులను తూతూమంత్రంగా నిర్వహిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామపంచాయతీ స్థాయిలో ప్రజలకు అవసరమైన జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఆస్తి వివరాల నిర్వహణతో పాటు అనేక అంశాల్లో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్న  పరిస్థితికి అద్దం పడుతుంది. గ్రామాల్లో ప్రభుత్వ పథకాల అమలు, రెవిన్యూ రికార్డుల నిర్వహణలో జాప్యం వహిస్తున్నట్లు ఆరోపణల వినిపిస్తున్నాయి. వారికి కేటాయించిన పంచాయతీల్లో ఉండాల్సింది పోయి ఎప్పుడు ఖమ్మం నగర కార్యాలయానికి అతుక్కొని పోయి ఉండటం మండల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో సర్టిఫికెట్ల కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందని బాధితులు ఆవేదన చెందుతున్నారు. అధికారులకు ఫోన్ చేసినా నిత్యం బిజీగా ఉన్నామని సమాధానం చెబుతున్నారని, కార్యాలయాలకు వెళ్లినా సకాలంలో పనులు పూర్తికావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసరంగా అవసరమైన ధ్రువీకరణ పత్రాలు అందకపోవడంతో విద్యార్థులు, రైతులు, సామాన్య ప్రజలు ప్రదక్షణలు చేయాల్సి వస్తోందని అంటున్నారు.మరోవైపు గ్రామాల్లో మట్టి తవ్వకాలు, మట్టి తరలింపు వ్యవహారాలతో పాటు పంచాయతీ పరిధిలో జరిగే ఇతర పనుల నిర్వహణపైనా పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని ఆర్థిక లావాదేవీల విషయంలోనూ పారదర్శకతపై ప్రజలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.ప్రజలకు ప్రభుత్వ సేవలు సక్రమంగా అందడం లేదనే విమర్శలు రావడం చర్చనీయాంశంగా మారింది. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అధికారులు ఇలా వ్యవహరిస్తే సామాన్యుల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలి!


ఖమ్మం రూరల్ మండలంలోని జీపీఓల విధుల నిర్వహణపై ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించాలని, వారికి కేటాయించిన కార్యాలయాల్లో అధికారులు అందుబాటులో ఉంటున్నారా లేదా? అనే అంశంపై ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. సర్టిఫికెట్ల జారీలో జాప్యం, విధుల పట్ల నిర్లక్ష్యం, మట్టి తవ్వకాల వ్యవహారం, ఆర్థిక లావాదేవీలపై వస్తున్న ఆరోపణలన్నింటిపైనా సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు ప్రజలకు అందుబాటులో లేకపోతే ప్రభుత్వ పాలనపై నమ్మకం ఎలా నిలుస్తుంది? ఇప్పటికైనా సంబంధిత అధికారులు తమ పనితీరును మార్చుకొని ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم