ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

లంచం కోసం చేయి చాచాడు.. ఏసీబీ వలలో చిక్కాడు..!


 

ప్రజాపక్షం/అశ్వరావుపేట : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరుస ఏసీబీ దాడుల నేపథ్యంలో అశ్వారావుపేటలో మరో అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఓ రైతు నుంచి రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఇరిగేషన్ శాఖ అధికారి ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.అశ్వారావుపేట పట్టణంలోని దొంతికుంట చెరువు నుంచి రైతు పొలానికి మట్టి తోలుకునేందుకు అనుమతి ఇచ్చే పేరుతో ఇరిగేషన్ శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) ఎల్. శ్రీనివాస్ రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. అనంతరం అశ్వారావుపేటలోని తన కార్యాలయంలో రైతు నుంచి నగదు స్వీకరిస్తుండగా ఖమ్మం రేంజ్ ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.ఈ ఘటనతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరోసారి ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై చర్చ మొదలైంది. ఏసీబీ అధికారులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم