కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ.. ప్రతి వార్డుకు ప్రత్యేక బాధ్యతలు
ప్రజాపక్షం / ఖమ్మం రూరల్:ఈ నెల 10వ తేదీన చింతకాని మండలం జగన్నాథపురంలో నిర్వహించనున్న ముఖ్యమంత్రి వ్యవసాయ రైతు సదస్సు విజయవంతం చేసేందుకు ఎదులాపురం మున్సిపాలిటీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. కార్యక్రమ నిర్వహణ కోసం ఎదులాపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తూ మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డుల వారీగా ప్రత్యేక అధికారులు, వార్డు అధికారులు, బస్సు ఇన్చార్జీలను నియమించారు. ఇందులో భాగంగా 23, 24, 28, 29, 30, 31, 32వ వార్డులకు ప్రత్యేక అధికారిగా కె. శ్రీధర్ రెడ్డి, వార్డు అధికారిగా కె. నరేష్, 3, 4, 5, 6, 22, 25, 26, 27వ వార్డులకు ప్రత్యేక అధికారిగా కె. శ్రీనివాసరావు, వార్డు అధికారిగా డి. కిరణ్, 20, 21వ వార్డులకు ప్రత్యేక అధికారిగా ప్రదీప్, వార్డు అధికారిగా వై. సువర్ణమ్మ, 19వ వార్డుకు ప్రత్యేక అధికారిగా రాజు, వార్డు అధికారిగా వై. సువర్ణమ్మ, 18వ వార్డుకు ప్రత్యేక అధికారిగా ఎస్.కె. బాబు, వార్డు అధికారిగా వై. సువర్ణమ్మ, 1, 2వ వార్డులకు ప్రత్యేక అధికారిగా ఎన్. రఘు, వార్డు అధికారిగా కె. నరేష్, 17వ వార్డుకు ప్రత్యేక అధికారిగా ఎం.డి. ఫరీఉద్దీన్, వార్డు అధికారిగా జి. శిరీష, 14, 15, 16వ వార్డులకు ప్రత్యేక అధికారిగా పి. శ్రీనివాస్, వార్డు అధికారిగా జి. శిరీష, 7వ వార్డుకు ప్రత్యేక అధికారిగా కె. జ్యోత్స్న, వార్డు అధికారిగా పి. ఉషారాణి, 8, 9, 12, 13వ వార్డులకు ప్రత్యేక అధికారిగా పి. సతీష్, వార్డు అధికారిగా కె. మధు, 10, 11వ వార్డులకు ప్రత్యేక అధికారిగా జి. వీరన్న, వార్డు అధికారిగా కె. మధు నియమితులయ్యారు.అలాగే ఆయా వార్డుల నుంచి రైతులు, ప్రజలను సీఎం సభా ప్రాంగణానికి తరలించే బాధ్యతతో బస్సు ఇన్చార్జీలను కూడా నియమించారు. ప్రతి వార్డు నుంచి రైతులు, ప్రజలు నిర్ణీత సమయానికి సభా ప్రాంగణానికి చేరుకునేలా రవాణా, సమన్వయం, హాజరు తదితర ఏర్పాట్లను పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు కమిషనర్ సూచించారు.

إرسال تعليق