ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

భద్రాచలం వద్ద 43 అడుగులు దాటిన గోదావరి.. కొనసాగుతున్న తొలి ప్రమాద హెచ్చరిక


 ప్రజాపక్షం/భద్రాచలం : గోదావరి నది నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం సాయంత్రం నాటికి నీటిమట్టం 43 అడుగులు దాటి, తొలి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, ఉపనదుల నుంచి వస్తున్న వరద ప్రవాహం కారణంగా గోదావరిలో నీటి ప్రవాహం పెరుగుతోంది.వరద పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నదీ తీర ప్రాంతాల్లో అనవసరంగా సంచరించవద్దని, చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. పరిస్థితిని బట్టి అవసరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.గోదావరి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم