శ్రీ చైతన్య పూర్వ విద్యార్థి అరుదైన ఘనత
అభినందించిన చైర్మన్, మల్లెంపాటి శ్రీధర్ యాజమాన్యం
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) శ్రీహరికోటలో విజయవంతంగా నిర్వహించిన భారతదేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ప్రయోగంలో ఖమ్మానికి చెందిన శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & రీసెర్చ్ పూర్వ విద్యార్థి వినయ్ కుమార్ ఇంజనీర్‌గా బాధ్యతలు నిర్వహించి అరుదైన ఘనత సాధించారు.మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన వినయ్ కుమార్, తన ప్రతిభతో దేశ అత్యున్నత అంతరిక్ష పరిశోధనా సంస్థ నిర్వహించిన కీలక రాకెట్ ప్రయోగంలో భాగస్వామి కావడం ఖమ్మం జిల్లాతో పాటు ఆయన చదివిన విద్యాసంస్థకు గర్వకారణంగా నిలిచింది.విద్యార్థి దశలో పొందిన సాంకేతిక నైపుణ్యం, ప్రాక్టికల్ శిక్షణ, క్రమశిక్షణ, పరిశోధనా దృక్పథమే ఈ స్థాయికి చేరుకోవడానికి దోహదపడిందని కళాశాల యాజమాన్యం చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్లు శ్రీవిద్య సాయి, గీతిక పేర్కొన్నారు. అలాగే వినయ్ కుమార్ సాధించిన ఈ విజయం ప్రస్తుత విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని, ఉన్నత లక్ష్యాలతో కృషి చేస్తే ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు అన్నారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి మరింత కీర్తి తీసుకురావాలని అధ్యాపకులు, విద్యార్థులు ఆకాంక్షించారు.


إرسال تعليق