ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

వారసత్వానికి తూట్లు.. భూభారతికి వక్రభాష్యం..!


 మామూళ్లు ఇస్తేనే పని.. లేదంటే ఫైళ్లకు బ్రేక్?

బోనకల్ రెవెన్యూ కార్యాలయంపై రైతుల తీవ్ర ఆరోపణలు

ప్రజాపక్షం/బోనకల్:బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణిపై తీవ్ర విమర్శలు చేస్తూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి కూడా రైతులకు ఆశించిన న్యాయం చేయడం లేదన్న విమర్శలు బోనకల్ మండలంలో బలంగా వినిపిస్తున్నాయి. రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన రెవెన్యూ యంత్రాంగమే కొత్త చట్టాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని రైతులు మండిపడుతున్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి ఉంటే, మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని రైతులు ప్రశ్నిస్తున్నారు.ఆళ్ళపాడు గ్రామానికి చెందిన ఓ రైతు ఐదేళ్ల క్రితం మృతి చెందగా, ఆయన ఎనిమిది ఎకరాల భూమిని మనవళ్ల పేరున వారసత్వంగా నమోదు చేసుకునేందుకు కుటుంబ సభ్యులు భూభారతి పోర్టల్‌లో స్లాట్ బుక్ చేసుకున్నారు. భూభారతిలో ఇందుకు స్పష్టమైన అవకాశం ఉన్నప్పటికీ, తహసీల్దార్ తిరస్కరించి మరోసారి కొత్త విధానంలో దరఖాస్తు చేయాలని సూచించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అనంతరం ఆర్‌ఐ విచారణ పేరుతో ప్రక్రియను నిలిపివేయడంతో వారం రోజులుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పని జరగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇదే సమయంలో, రూ.2 లక్షలు ఇస్తే పని పూర్తవుతుందని కార్యాలయంలో పనిచేసే ఆపరేటర్ ద్వారా బేరసారాలు జరిగాయని వారసులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. భూభారతి నిబంధనలను అధికారులు తమకు అనుకూలంగా అర్థం చేసుకుని రైతులను వేధిస్తున్నారని, మధ్యవర్తుల ద్వారా వచ్చే వారికి మాత్రమే పనులు వేగంగా పూర్తవుతున్నాయని ఆరోపిస్తున్నారు.గతంలో అవినీతి ఆరోపణలతో విధుల నుంచి తొలగించబడిన ఓ ప్రైవేటు వ్యక్తి ఇప్పటికీ రెవెన్యూ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తూ స్లాట్ బుకింగ్‌లు, రిజిస్ట్రేషన్‌లలో మధ్యవర్తిత్వం చేస్తున్నాడని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయంలో అనధికార వ్యక్తుల పెత్తనం ఎందుకు కొనసాగుతోందని ప్రశ్నిస్తున్నారు.అంతేకాదు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటలకు ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అధికారులు, సిబ్బంది ఆలస్యంగా వస్తున్నారని, సాయంత్రం 5 గంటల వరకు ఉండాల్సిన వారు 3–4 గంటలకే కార్యాలయం వీడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అత్యవసర పనులతో వచ్చిన వారిని "ఆర్డీవో కార్యాలయంలో ఉన్నాం", "కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాం" అంటూ వెనక్కి పంపుతున్నారని వాపోతున్నారు.వాల్యూ సర్టిఫికెట్లు సహా ఇతర సేవలకు కూడా మామూళ్లు చెల్లించకపోతే పనులు జరగడం లేదని ఆళ్ళపాడు, చిరునోముల గ్రామాల రైతులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ కార్యాలయంలో అవినీతి, ఆలస్యం, మధ్యవర్తుల వ్యవస్థపై ఉన్నతాధికారులు వెంటనే సమగ్ర విచారణ చేపట్టి, ఆరోపణలు నిజమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم