ప్రజాపక్షం/ ఖమ్మం రూరల్ : ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డులో శ్రావణమాసం సందర్భంగా ముత్యాలమ్మ అమ్మవారి వేడుకలను ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ కౌన్సిలర్ దండి రంగారావు వేడుకల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు, ప్రదర్శనలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి తీర్థ ప్రసాదాలను సమర్పించి, భక్తులు స్వీకరించారు. సంప్రదాయ ఆచారాల్లో భాగంగా జంతు బలి కార్యక్రమం కూడా నిర్వహించారు. ముత్యాలమ్మ అమ్మవారి నామస్మరణతో వార్డులో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో వేడుకలు సందడిగా, భక్తిశ్రద్ధల మధ్య కొనసాగాయి.

إرسال تعليق