ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలంలోని పోలిశెట్టి గూడెం గ్రామపంచాయతీలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కళ్లెం జాన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ జాన్‌రెడ్డి మాట్లాడుతూ... స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, దేశ అభివృద్ధికి ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొట్టే వెంకటేశ్వర్లు, గ్రామ సెక్రటరీ రజిత, గ్రామ పెద్దలు వడ్డే రామయ్య, ధనాల కొండయ్య, కొయ్య చిన్న సీతయ్య, కోటయ్య, అజీర్, సోము నర్సిరెడ్డి, పగిళ్ల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق