ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

నిరుపేద కుటుంబానికి ఆపన్నహస్తం


 ఆపరేషన్‌ కోసం రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేసిన కిషోర్‌ నాయక్

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబానికి ఏదులాపురం మున్సిపాలిటీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు కిషోర్‌ నాయక్‌ ఆపన్నహస్తం అందించారు. ఆపరేషన్‌ చేయించుకోవాల్సిన కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న ఆయన, మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని ఆదివారం అందజేశారు. ఆపద సమయంలో అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించిన కిషోర్‌ నాయక్‌కు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. నిరుపేదలకు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 27వ వార్డు కౌన్సిలర్‌ బానోత్‌ పుల్చంద్‌, 5వ వార్డు కౌన్సిలర్‌ బానోత్‌ ప్రసాద్‌తో పాటు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم