ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

అట్టహాసంగా ఆషాడం మైసమ్మ బోనాలు



 భక్తి పారవశ్యంలో మునిగిన శ్రీ సాయి బృందావన్ కాలనీ

మైసమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డులో గల శ్రీ సాయి బృందావన్ కా


లనీలో ఆదివారం ఆషాడం మైసమ్మ బోనాల మహోత్సవం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలు ఎత్తుకుని, శివసత్తుల విన్యాసాలు, డప్పు వాయిద్యాల నడుమ నిర్వహించిన భారీ ఊరేగింపు కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది. జై మైసమ్మ నినాదాలతో కాలనీ అంతా మారుమోగింది. అనంతరం కాలనీ ప్రవేశ ద్వారం వద్ద వెలసిన మైసమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు బోనాలు సమర్పించారు. నైవేద్యాలు సమర్పించడంతో పాటు సంప్రదాయం ప్రకారం జంతు బలి ఇచ్చి ప్రత్యేక మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.ఈ బోనాల వేడుకల్లో సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మైసమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే సిపిఐ కౌన్సిలర్ దండి శ్రీజలోకేష్ బోనం ఎత్తుకొని మహిళలతో కలిసి ఊరేగింపులో పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాలనీ కమిటీ సభ్యులు, మహిళలు, యువకులు, చిన్నారులు, ప్రజాప్రతినిధులు, సిపిఐ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم