ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

కమ్యూనిజం అజరామరం...


 

 ఈ వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించాలి

 కమ్యూనిస్టుల ఆవశ్యకత పెరుగుతోంది

 సిపిఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు

 అట్టహాసంగా ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం మండలాల సిపిఐ శిక్షణా తరగతులు

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: సిపిఐ పార్టీ 100 ఏండ్ల చరిత్రలో అధికారం ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ అజరామరంగా కొనసాగుతోందని సిపిఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు అన్నారు. ఆదివారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ముత్తగూడెంలో అనుముల రామ్‌రెడ్డి ఫంక్షన్ హాల్‌లో ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం మండలాల సిపిఐ శిక్షణా తరగతులు అట్టహాసంగా నిర్వహించారు.తొలుత ముత్తగూడెంలో ఏర్పాటు చేసిన అరుణ పతాకాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అరుణ పతాకాన్ని సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మొహమ్మద్ మౌలానా ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో భాగం హేమంతరావు మాట్లాడుతూ కమ్యూనిస్టులకు అధికారం అవసరం కాదని, బూర్జువా పార్టీలకే అధికారం లక్ష్యమని అన్నారు. అలాంటి పార్టీలు అధికారం ఉన్నప్పుడే కనిపిస్తాయని, అధికారం కోల్పోయిన తర్వాత కాలగర్భంలో కలిసిపోతాయని వ్యాఖ్యానించారు.తెలంగాణ సాయుధ పోరాటంతో పాటు ప్రజల హక్కుల సాధనలో కమ్యూనిస్టుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రజల పక్షాన చట్టసభల్లో కమ్యూనిస్టు ఎంపీలు, ఎమ్మెల్యేలు గట్టిగా గొంతెత్తి హక్కులు సాధించారని గుర్తు చేశారు. అయితే డబ్బు ప్రభావం పెరగడంతో కమ్యూనిస్టులు బలహీనపడగా, కార్పొరేట్ శక్తులు బలపడి దేశ సంపదను దోచుకుంటున్నాయని విమర్శించారు.మతం ముసుగులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల మధ్య విభేదాలను సృష్టిస్తూ అధికారాన్ని అనుభవిస్తున్నారని దుయ్యబట్టారు. తాము ఎప్పుడూ మతాలను విమర్శించలేదని, కులమత భేదాలు లేని సమసమాజ నిర్మాణమే కమ్యూనిస్టుల లక్ష్యమని స్పష్టం చేశారు. శ్రీరాముడి పేరుతో రాజకీయాలు చేస్తున్న బీజేపీ పాలనలో అయోధ్య నిర్మాణంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. వారికి మతం, దేవుళ్లపై ప్రేమ కాదని, అధికార కాంక్ష మాత్రమే ముఖ్యమని అన్నారు.ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు భావజాలం అవసరం పెరుగుతోందని, ప్రపంచ రాజకీయ పరిణామాలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం "కమ్యూనిస్టు భూతం ప్రపంచాన్ని ఆవహించబోతోంది" అని వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగిన విద్యార్థి ఉద్యమంలో "ఇంక్విలాబ్ జిందాబాద్" నినాదాలతో పోరాటం సాగిందని, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు విద్యార్థులు వెనక్కి తగ్గలేదని అన్నారు. ఇంట్లో తల్లిదండ్రుల మందలింపులు, బయట పోలీసుల లాఠీ దెబ్బలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ఆ విద్యార్థుల పోరాటస్ఫూర్తి కమ్యూనిస్టులకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.ఈ శిక్షణా తరగతుల్లో ఉపాధ్యాయుడిగా భాగం హేమంతరావు, ప్రిన్సిపాల్‌గా సిద్ధినేని కర్ణకుమార్, వైస్ ప్రిన్సిపల్స్‌గా ఉన్నం రంగారావు, చెరుకుపల్లి భాస్కర్ వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు మెడకంటి చిన్న వెంకటరెడ్డి, రాష్ట్ర గిరిజన సంఘం అధ్యక్షులు అజ్మీరా రామ్మూర్తి, జిల్లా కార్యవర్గ సభ్యులు పుచ్చకాయల కమలాకర్, సింగ్ నరసింహారావు, ఏనుగు వెంకటేశ్వరరావు, సిపిఐ జిల్లా సమితి సభ్యులు దంతాల బాలరాజు, లింగా వెంకటనారాయణ, సురేందర్, పగిళ్ల వీరభద్రం, యడ్లపల్లి శంకరయ్య, బూర నాగేశ్వరరావు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ గౌస్ పాషా, సిపిఐ మండల కార్యదర్శి పుచ్చకాయల సుధాకర్, 28, 32 వార్డుల సిపిఐ కౌన్సిలర్లు దండి రంగారావు, మామిండ్ల శ్రీనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم