ఖమ్మం రూరల్ మండలం ఫోటోగ్రాఫర్ ఆరంపులం మస్తాన్ ప్రతిభకు గుర్తింపు
ప్రజాపక్షం / ఖమ్మం రూరల్: ఖమ్మం ఫోటోగ్రఫీ పోటీ–2026లో ఖమ్మం రూరల్ మండలం అరెకోడు గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ ఆరంపులం మస్తాన్ ప్రతిభ చాటుకున్నారు. ఆయన తీసిన అద్భుతమైన ఫోటోకు గాను బెస్ట్ ఫోటోగ్రాఫర్ అవార్డు లభించింది. హెచ్‌కే ఆర్ట్ ఫోటోగ్రఫీ ఆధ్వర్యంలో నిర్వహించిన 187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ పురస్కార ప్రదానోత్సవంలో మస్తాన్‌ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఖమ్మం జిల్లా అదనపు డీసీపీ (పరిపాలన) బోజ్జ రామానుజం చేతుల మీదుగా ఆయన అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా మస్తాన్ మాట్లాడుతూ తన ఫోటోగ్రఫీ ప్రతిభకు లభించిన ఈ గుర్తింపు ఎంతో ఆనందం, గర్వాన్ని కలిగించిందన్నారు. తనను ప్రోత్సహించి అవార్డుకు ఎంపిక చేసిన హెచ్‌కే హుస్సేన్, హెచ్‌కే ఆర్ట్ ఫోటోగ్రఫీ, ఖమ్మం జిల్లా ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నిర్వాహకులు, విశిష్ట అతిథులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన యువ ఫోటోగ్రాఫర్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా తన ప్రతిభను చాటుకోవడం పట్ల అరెకోడు గ్రామస్థులు, మిత్రులు, ఫోటోగ్రఫీ రంగానికి చెందిన పలువురు అభినందనలు తెలిపారు.

إرسال تعليق