లబ్ధిదారులు ఎంత మంది..?
ప్రభుత్వ స్థలాలను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్ అపూర్వ.
ప్రజాపక్షం / నేలకొండపల్లి: ప్రభుత్వ స్థలాలు ఎన్ని ఉన్నాయి... ఎక్కడెక్కడ ఉన్నాయి.. ఎంత మంది లబ్ధిదారులు ఉన్నారని క్షేత్ర స్థాయిలో డిప్యూటీ కలెక్టర్ అపూర్వ పరిశీలించారు. జిల్లా కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఆదేశాల మేరకు శుక్రవారం మండలం లోని మోటాపురం, సదాశివాపురం, రామచంద్రాపురం గ్రామాలలో పర్యటించారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాలకు అనువుగా ఉన్నాయా లేదా లని క్షేత్ర స్థాయిలో పరిశీలంచారు. గ్రామాల వారీగా ఖాళీ స్థలాలు, లబ్ధిదారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వివిధ అంశాలను రెవిన్యూ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. "లబ్దిదారుల సంఖ్య ను బట్టి ఇండ్ల స్థలాలు ఇస్తారా.. లేదా ఎన్ని గజాలుఇస్తారు అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థలం తక్కువగా ఉండి... లబ్ధిదారులు ఎక్కువగా ఉంటే ఎలా నిర్ణయిస్తారని...లబ్ధిదారులను గుర్తించారా లేదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మండల రెవిన్యూ ఇన్సెపెక్టర్ ఆలస్యం మధుసూధన్ రావు, జీపీవోలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు

إرسال تعليق