ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం



 

మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి


చెత్త మధ్య పనిచేసే చేతుల కోసం ఉచిత వైద్య శిబిరం

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: మున్సిపాలిటీ పరిశుభ్రత ఎంత ముఖ్యమో.. కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కూడా తమకు అంతే ముఖ్యమని మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం స్వచ్ఛతాహి-2026 లో భాగంగా ఏదులాపురం మున్సిపాలిటీలో ఎంవీ, పాలెం పీహెచ్‌సీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికుల కోసం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి శిబిరాన్ని ప్రారంభించి కార్మికుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించారు. ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఉదయం లేచినప్పటి నుంచి పరిశుభ్రమైన పరిసరాలను ఆస్వాదించడానికి కారణమైన పారిశుద్ధ్య కార్మికులు మాత్రం ప్రతిరోజూ చెత్త, దుమ్ము, మురుగు మధ్య పనిచేస్తుంటారని అన్నారు. వారి సేవలు పట్టణ పరిశుభ్రతలో ఎంతో కీలకమని, అలాంటి కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.పారిశుద్ధ్య కార్మికులకు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం, అవసరమైన వైద్య సేవలు అందించడం ద్వారా వారి ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.అదే సమయంలో పట్టణ పరిశుభ్రత కేవలం మున్సిపల్ కార్మికుల బాధ్యత మాత్రమే కాదని ప్రజలు తమ ఇళ్లను ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకుంటారో, ఇంటి పరిసరాలను కూడా అదే విధంగా శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా చేసి ప్రతిరోజూ వచ్చే పారిశుద్ధ్య వాహనాలకు అందించాలని కోరారు.ప్రజలు చెత్తను రోడ్లపై, ఖాళీ ప్రదేశాల్లో వేయకుండా సహకరిస్తే పారిశుద్ధ్య కార్మికులపై భారం తగ్గడంతో పాటు పట్టణం మరింత పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం కార్మికులు వైద్య చికిత్సలు చేపించుకున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కౌన్సిలర్లు మామిండ్ల శ్రీనాథ్ రెడ్డి, దండి శ్రీజ, కాంగ్రెస్ కౌన్సిలర్ సోము వెంకటరెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్ వీరన్న, పి ఎస్ సి వైద్యుడు మైధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم