పోస్ట్‌లు

నవంబర్, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

చికెన్ మటన్చా-పల-వ్యర్ధాల వేలంపాటకు

చిత్రం
 ప్రజాపక్షం/ ఖమ్మం రూరల్: ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చికెన్, మటన్, చేపల వ్యర్థాల సేకరణ, రవాణా కాంట్రాక్టు నిర్వహణకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఎ. శ్రీనివాస రెడ్డి తెలిపారు.ఈ నెల 4వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు ఎదులాపురం మున్సిపల్ కార్యాలయంలో వేలం ప్రక్రియ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వేలంలో పాల్గొనదలచిన వారు రూ.1,50,000 డిపాజిట్‌తో పాటు రూ.10,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 

ఖమ్మం జిల్లా కోర్టుకు గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు

చిత్రం
  2021 ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నమోదైన కేసు విచారణకు హాజరు  ప్రజాపక్షం/ఖమ్మం రూరల్:   రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా కోర్టుకు హాజరయ్యారు. 2021 డిసెంబర్‌లో జరిగిన ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నమోదైన కేసుకు సంబంధించి మంగళవారం ఆయన కోర్టుకు వచ్చారు.  ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన రాయల నాగేశ్వరరావు, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపిస్తూ తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం ఆయనతో పాటు పలువురిపై కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి కోర్టు విచారణలో భాగంగా రాయల నాగేశ్వరరావు హాజరయ్యారు.  ఆయనతో పాటు మిక్కిలినేని నరేంద్ర, ఐనాల నరసింహారావు, బచ్చలకూరి నాగరాజు, పల్లిపాటి కృష్ణ, అజ్గర్, మట్టా రవీందర్ రెడ్డి, పురుషోత్తం, తుపాకుల వెంకన్న తదితరులు కోర్టుకు హాజరయ్యారు.

పదవిలో ఉన్నా.. పంథా మారని కమ్యూనిస్టు నేత

చిత్రం
  కురుస్తున్న వానలోనే పంట పొలాల్లోకి కూనంనేని.. రైతులతో మమేకం హంగులు, ఆర్భాటాలకు దూరంగా ప్రజాక్షేత్రంలో సీపీఐ ఎమ్మెల్యే పర్యటన ప్రజాపక్షం/ కొనిజర్ల: ప్రజా సమస్యలే ఎజెండాగా, ప్రజల మధ్యే ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవడమే కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతమని మరోసారి చాటిచెప్పారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. హంగులు, ఆర్భాటాలకు తావులేకుండా, కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నేరుగా పంట పొలాల్లోకి వెళ్లి రైతుల పరిస్థితులను తెలుసుకోవడం కమ్యూనిస్టు నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది.  ఎల్‌నినో ప్రభావంతో పంటలపై ఏర్పడిన పరిస్థితులను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు మంగళవారం కొణిజర్ల మండలంలో కూనంనేని పర్యటించారు. కొణిజర్ల గ్రామ పరిధిలోని వ్యవసాయ భూములను వర్షంలోనే పరిశీలించి, పంటల ప్రస్తుత స్థితిగతులను రైతులను అడిగి తెలుసుకున్నారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పంటలకు ఎదురవుతున్న ఇబ్బందులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వారితో చర్చించారు.  సాధారణంగా ప్రజాప్రతినిధుల పర్యటనలంటే అధికారుల హడావుడి, స్వాగత ఏర్పాట్లు, హంగులు కనిపించే ప్రస్తుత రాజకీయ ...

సిద్దినేని కోటయ్య పోరాట పటిమ నేటి యువతకు ఆదర్శం

చిత్రం
   సీపీఐ మండల కార్యదర్శి పుచ్చకాయల సుధాకర్ గూడూరుపాడులో ఘనంగా 20వ వర్ధంతి వేడుకలు ప్రజాపక్షం/ ఖమ్మం రూరల్:  ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు సాగిస్తూ, జీవితాంతం కమ్యూనిస్టు సిద్ధాంతాలకు కట్టుబడి కొనసాగిన సిద్దినేని కోటయ్య పోరాట పటిమ నేటి యువతకు ఆదర్శమని సీపీఐ ఖమ్మం రూరల్ మండల కార్యదర్శి పుచ్చకాయల సుధాకర్ అన్నారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడు గ్రామంలో సిద్దినేని కోటయ్య 20వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్మారక స్థూపానికి పూలమాలలు వేసి నాయకులు ఘనంగానివాళులర్పించారు. అనంతరం పుచ్చకాయల సుధాకర్ మాట్లాడుతూ.. పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం సిద్దినేని కోటయ్య చేసిన సేవలు, సాగించిన పోరాటాలు చిరస్మరణీయమని కొనియాడారు. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా వెనుకడుగు వేయకుండా ఎర్రజెండా అండతో ప్రజల పక్షాన నిలిచిన ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు. కమ్యూనిస్టు ఉద్యమానికి ఆయన అందించిన సేవలను నేటి తరం యువత గుర్తించి, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు సిద్దినేని కర్ణకుమార్, మాజీ సర్పంచ్ బండి...

వృద్ధాశ్రమంలో ఉప్పల చారి జన్మదిన వేడుకలు...

చిత్రం
  రోగులకి పండ్లు బ్రెడ్ పంపిణీ ప్రజాపక్షం/ వైరా:  నిధి ఇట్ సాఫ్ట్వేర్ కంపెనీ మేనేజ్మెంట్ అండ్ డైరెక్టర్ గరిదేపల్లి సాయికిరణ్ ఆధ్వర్యం ఘనంగా  రామోజీ ఉప్పల చారి జన్మదిన వేడుకలను గొల్లపూడి వృద్ధాశ్రమం లో నిర్వహించారు. అనంతరం వైరా గవర్నమెంట్ హాస్పిటల్ లో రోగులతోకి ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఈ సందర్భంగా వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసి, వారికి స్వయంగా వంటకాలను వడ్డిస్తూ వారితో ఆప్యాయంగా ముచ్చటించి సంతోషాన్ని పంచుకున్నారు.  ఈ సందర్భంగా ఉప్పల చారి మాట్లాడుతూ.. పుట్టినరోజును వృద్ధుల మధ్య జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. వృద్ధాశ్రమంలో ఉంటున్న వృద్ధుల సంక్షేమం, అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు చేయూత అందించాలని కోరారు. మనం అందించే చిన్న సహాయం సైతం వారికి ఎంతో అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. వృద్ధులను ప్రేమతో, ఆప్యాయతతో ఆదరించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమo లో చింతపల్లి వినోద్,మోడ్రు సురేష్,మొండ్రు బాలరాజు,వేముల శ్రీనాథ్ ,మురళీ ,దేవాళ్ళ సాయి,రాచకొండ సాయి,నిఖిల్ ,బత్తుల సాయి,ఆసిఫ్ ,చింతపల్లి మానికుమార్, అడ్డు తదితరులు పాల్గొన్నారు

తెల్లారుపల్లి వద్ద ఎన్నెస్పీ కాల్వపై బ్రిడ్జి నిర్మిస్తాం

చిత్రం
  రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి రూ.5 కోట్లతో చేపట్టేందుకు ఆమోదించినట్లు వెల్లడి   తెల్లారుపల్లి 14,15,16వ వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: తెల్దారుపల్లి వద్ద స్థానిక రైతులు గ్రామానికి అవతల వైపు ఉన్న తమ వ్యవసాయ భూముల వద్దకు వెళ్లేందుకు, గ్రామస్తుల సౌకర్యార్ధం రూ.5 కోట్ల నిధులతో ఎన్నెస్పి కాలువపై నూతన బ్రిడ్జిని నిర్మిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. మంగళవారం తెల్దారుపల్లి లోని 14,15,16వ వార్డుల్లో రూ. 3.20 కోట్లతో నిర్మించే సిసి రోడ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం కలెక్టర్ దివాకర.టిఎస్, ఏదులాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్ లతో కలిసి మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం వచ్చిన ఈ 33 నెలల్లో తెల్దారుపల్లి అభివృద్ధికి.. రూ. 16.06 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. రూ.5.25 కోట్లతో 105 ఇందిరమ్మ ఇళ్లను పేదలకు ఇచ్చామని చెప్పారు. గత ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని, ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రూ. 2లక్ష...

మాకు కాలువ వద్దు.. కన్నీళ్లు వద్దు!

చిత్రం
ఎస్సార్ఎల్పీ పాలేరు లింక్ కెనాల్ భూసేకరణను నిలిపివేయాలి  తహసీల్దార్‌కు నాలుగు గ్రామాల రైతుల వినతి ప్రజాపక్షం/రఘునాథపాలెం:  సీతారామ ఎత్తి పోతల పథకం (ఎస్సార్ఎల్పీ)లో భాగంగా ప్రతిపాదించిన పాలేరు లింక్ కెనాల్ భూసేకరణపై అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాలను బలితీసుకునే కాలువ నిర్మాణం తమకు వద్దే వద్దంటూ రఘునాథపాలెం మండల పరిధిలోని నాలుగు గ్రామాల రైతులు ఏకతాటిపైకి వచ్చి ఆందోళన బాట పట్టారు. ​మంగళవారం మండలంలోని చిమ్మపూడి, మంచుకొండ, కోయచలక, రేగులచలక గ్రామాల రైతులు  రఘునాథపాలెం తహసీల్దార్‌ ఎస్. శ్వేత ను కలిసి వినతిపత్రం సమర్పించారు.  ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, కాలువ తవ్వకం వల్ల వచ్చే ప్రయోజనాల కంటే తాము సర్వస్వం కోల్పోయి నడిరోడ్డున పడాల్సిన దుస్థితి ఏర్పడుతోందని ఆవేదన  వ్యక్తం చేశారు . తరతరాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సారవంతమైన భూములను కెనాల్ కోసం లాక్కుంటే తాము బతికేదెలాగని ప్రశ్నించారు. వ్యవసాయంపైనే ఆధారపడి బతుకుతున్న తమ కుటుంబాల భవిష్యత్తు అంధకారం అవుతుందన్నారు. అధికారులు కాలువ ప్రతిపాదనను రద్దు చేసి భూసేకరణ ను తక్షణమే నిలిపివేయాలని డిమాం...

గేదెల కొనుగోళ్లలో భారీ గోల్‌మాల్‌!

చిత్రం
మహిళా డెయిరీ పథకానికి దళారుల గ్రహణం అధికారుల కనుసన్నల్లోనే అక్రమాలా? కొనుగోలు కేంద్రం మార్పు.. కమీషన్ల ఆరోపణలు కలెక్టర్ ఆగ్రహం.. విచారణకు ఆదేశం.. బాధ్యులపై సస్పెన్షన్ వేటు! ప్రజాపక్షం/బోనకల్: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి కోటీశ్వరులను చేయాలనే ఉన్నత లక్ష్యంతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిర మహిళా డెయిరీ పథకానికి దళారుల గ్రహణం పట్టిందా? మహిళా లబ్ధిదారులకు నాణ్యమైన పాడి గేదెలను అందించాల్సిన కొనుగోళ్ల ప్రక్రియ కమీషన్ల కాసుల వేటగా మారుతోందా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మధ్యవర్తుల జోక్యం, కొనుగోలు కేంద్రాల మార్పు, అధికారుల పర్యవేక్షణ లోపాలు, కమీషన్ల డిమాండ్లపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు పథకం అమలుతీరుపై తీవ్ర విమర్శలకు తావిస్తున్నాయి. బోనకల్ మండలంలో వెలుగుచూసిన ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ దివాకర ఆగ్రహం వ్యక్తం చేసి విచారణకు ఆదేశించడంతో అధికారుల్లో కలవరం మొదలైంది. దళారుల కనుసన్నల్లో కొనుగోళ్లు! బోనకల్ మండలానికి చెందిన అధికారుల బృందం గత శనివారం (31వ తేదీ) లబ్ధిదారులతో కలిసి గేదెల కొనుగోలు కోసం పశ్చిమగ...

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే ధ్యేయం.. స్మార్ట్ రేషన్ కార్డులతో పేదలకు ప్రయోజనం

చిత్రం
    మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి ప్రజాపక్షం/ఖమ్మంరూరల్: ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరడమే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధాన లక్ష్యమని ఆయన క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి అన్నారు. ఏ ఒక్క అర్హుడూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. సోమవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు గుర్రాలపాడులో నూతన డిజిటల్ (స్మార్ట్) రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ కౌన్సిలర్ బుర్ర మహేష్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ...పేద, నిరుపేద కుటుంబాలకు ఆహార భద్రత కల్పించడంతో పాటు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అర్హులకు అందించేందుకు స్మార్ట్ రేషన్ కార్డులు దోహదపడతాయని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ప్రతి కుటుంబానికి చేరేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన ప్రభుత్వ సేవలను వారి వద్దకే తీసుకెళ్లాలన్నదే మంత్రి పొంగులేటి ఆలోచన అ...

మానవ అక్రమ రవాణా నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

చిత్రం
  పిల్లల భద్రతపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి – మై ఛాయిసెస్ ఫౌండేషన్ స్టేట్ కోఆర్డినేటర్ క్రాంతి అహరోన్ ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: మానవ అక్రమ రవాణా నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకొచ్చి భాగస్వాములు కావాలని మై ఛాయిసెస్ ఫౌండేషన్ స్టేట్ కోఆర్డినేటర్ క్రాంతి అహరోన్ పిలుపునిచ్చారు. స్కోప్ ఆర్డీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సురక్షిత గ్రామ కార్యక్రమంలో భాగంగా ఎదులాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మానవ అక్రమ రవాణాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.గత ఎనిమిదేళ్లుగా తెలంగాణ పోలీస్ ఉమెన్స్ సేఫ్టీ వింగ్ భాగస్వామ్యంతో ఖమ్మం జిల్లాలో స్కోప్ ఆర్డీ ద్వారా సురక్షిత గ్రామ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మానవ అక్రమ రవాణా తీవ్రమైన నేరమని, పిల్లలు, మహిళలను వివిధ రకాల దోపిడీకి గురిచేసే ఉద్దేశంతో మోసం, బలవంతం వంటి మార్గాల్లో వ్యక్తులను నియమించడం, తరలించడం జరుగుతుందని వివరించారు. అక్రమ రవాణా బాధితుల్లో మహిళలు, బాలికలు అధికంగా ఉంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉంటూ పిల్లలకు సురక్షిత వాతావరణం కల్పిం...

ఆర్ ఎం ప్రసాద్ కి ఇండియన్ గ్లోరీ అవార్డు..

చిత్రం
  30 ఏళ్ల నృత్య ప్రస్థానానికి గుర్తింపు  నటుడు సుమన్ చేతుల మీదుగా జ్ఞప్తిక అందజేత ప్రజాపక్షం / ఖమ్మంరూరల్ : నృత్యాన్ని తన శ్వాసగా, తన జీవితంగా మలచుకుని 30 సంవత్సరాలుగా నిర్విరామంగా నృత్య రంగంలో సేవలందిస్తున్న నృత్య దర్శకులు, ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాల సాంస్కృతిక అధ్యాపకుడు ఆర్ఎం ప్రసాద్ కి ప్రతిష్టాత్మక  ఇండియన్ గ్లోరీ అవార్డు లభించింది.  కళారత్న మూవీస్, రాజు ఎంటర్టైనర్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాదులో నిర్వహించిన కార్యక్రమంలో సినీ నటుడు సుమన్ ఆర్ఎం ప్రసాద్ కు ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా నటుడు సుమంత్ తో పాటు పలువురు ప్రముఖులు మాట్లాడుతూ... మూడు దశాబ్దాల పాటు ఎంతో మంది ఔత్సాహిక కళాకారులను తీర్చిదిద్దుతూ వేలాది మంది విద్యార్థులకు నృత్యంలో మెళకువలు నేర్పించారన్నారు. కళా రంగానికి ఆయన చేసిన కృషి నీ కొనియాడారు. డాన్స్ అంటే కేవలం స్టెప్పులు మాత్రమే కాదని అది ఒక క్రమశిక్షణ, ఒక సంస్కారం అని తన శిష్యులకు నిరూపించారన్నారు. ఎన్నో వేదికలపై తనదైన ముద్ర వేసి ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నప్పటికీ ఈగ్లోరీ అవార్డు ఆయన 30 ఏళ్ల సుదీర్ఘ కళా ప్రయాణానికి దక్కిన...

కూసుమంచికి కరువు ముద్ర ఎందుకు?

చిత్రం
    సాగునీటి వనరులున్న ప్రాంతానికి కరువు ప్రకటన ఎంతవరకు సమంజసం? క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి కరువు అంచనాల్లో శాస్త్రీయత ఉండాలి.. ప్రకటనల్లో క్షేత్రస్థాయి వాస్తవాలకు ప్రాధాన్యత ఇవ్వాాలి! ప్రజాపక్షం/కూసుమంచి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 365 మండలాలను కరువు ప్రభావిత మండలాలుగా ప్రకటించడం వ్యవసాయ రంగంలో చర్చకు దారితీస్తోంది. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కరువు పరిస్థితులను గుర్తించడం, అవసరమైన సహాయక చర్యలు చేపట్టడం స్వాగతించదగిన విషయమే. అయితే, కరువు మండలాల ఎంపికలో ప్రతి ప్రాంతానికి సంబంధించిన వాస్తవ పరిస్థితులను సమగ్రంగా పరిశీలించారా? సాగునీటి వసతులు, పంటల సాగు, దిగుబడులు, పంట నష్టం వంటి అంశాలను స్థానికంగా ఎంతవరకు పరిగణనలోకి తీసుకున్నారు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ పరిధిలోని కూసుమంచి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించడంపై పునఃపరిశీలన జరగాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం స్థానిక వ్యవసాయ పరిస్థితులను పరిశీలిస్తే వ్యక్తమవుతోంది. సాగునీటి వనరులకు కొ...

ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ వివాదంపై కలెక్టర్‌కు సీపీఐ ఫిర్యాదు

చిత్రం
  కౌన్సిలర్ల హక్కులకు భంగం కలిగించారంటూ ఆరోపణ  మున్సిపల్, హౌసింగ్ శాఖలపై సమగ్ర విచారణకు డిమాండ్ ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని పీవీఆర్ గార్డెన్‌లో అక్టోబర్ 31వ తేదీన రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ సందర్భంగా చోటుచేసుకున్న వివాదంపై ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.కు సీపీఐ ఖమ్మం రూరల్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో కలెక్టర్‌ దివాకర టిఎస్ ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఎదులాపురం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అధికారికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  ఇళ్ల ప్రొసీడింగ్స్ పంపిణీలో కాంగ్రెస్ నాయకులు వ్యవహరించిన తీరుతో కౌన్సిలర్ల హక్కులకు భంగం కలిగిందని సీపీఐ నాయకులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే కాంగ్రెస్ నాయకులు అధికారుల వద్ద నుంచి ప్రొసీడింగ్ పత్రాలు తీసుకొని పంపిణీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఎదులాపురం మున్సిపాలిటీ పర్యవేక్షణ, హౌసింగ్ శాఖ అధికారుల పాత్రపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. వివాదానికి సంబంధించిన ఫొటోలు, వివిధ పత్రికల్లో ప్రచురితమైన వార్తా కథనాల క్లి...

నీటి గండం పొంచి ఉన్నా.. వరి వైపే రైతుల చూపు!

చిత్రం
  సాగునీటి హెచ్చరికలు బేఖాతరు.. నారుమళ్లకు రైతుల సన్నాహాలు ఆరుతడి పంటల సాగుపై ఆసక్తి కరువు ప్రజాపక్షం / నేలకొండపల్లి:  రానున్న రోజుల్లో నీటి ఎద్దడి తప్పదని ప్రభుత్వం, వ్యవసాయ శాఖ పదేపదే హెచ్చరిస్తున్నా రైతుల నిర్ణయం మాత్రం మారడం లేదు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు కొనసాగనున్నాయని, బోరుబావులపై ఒత్తిడి పెరుగుతుందని చెబుతున్నా రైతులు వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. ప్రత్యామ్నాయంగా పెసర, మినుములు, కందులు, సజ్జలు సాగు చేయాలని సూచనలు వస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం నారుమళ్ల ఏర్పాట్లు జోరందుకున్నాయి. బోరుబావులపైనే భరోసా.. జిల్లాలో లోటు వర్షపాతం కారణంగా చెరువులు, వాగులు, కుంటలు ఆశించిన మేర నిండలేదు. యాసంగిలో సాగునీటి కొరత తీవ్రంగా ఉండొచ్చన్న అంచనాలు ఉన్నా రైతులు బోరుబావుల ఆధారంగా వరి సాగుకు సిద్ధమవుతున్నారు. భూగర్భ జలాల లభ్యతపై సందేహాలు ఉన్నా దుక్కులు దున్ని నారుమళ్లు సిద్ధం చేస్తున్నారు. యాంత్రీకరణతో వరికే మొగ్గు.. వరి సాగులో యాంత్రీకరణ రైతులను మరింత ఆకర్షిస్తోంది. నాట్లకు కూలీలు అందుబాటులో ఉండటం, పురుగుమందుల పిచికారీకి డ్రోన్లు, కోతలకు యంత్రాలు లభిస్తుండటంతో శ్రమ తగ్గిందన...

ఖమ్మం రూరల్‌లో జీపీఓల ఇష్టారాజ్యం!

చిత్రం
  ప్రజలకు అందని ప్రభుత్వ సేవలు సర్టిఫికెట్ల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు ఫోన్ చేసినా స్పందన కరువు.. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలంలో కొందరు గ్రామపంచాయతీ అధికారుల (జీపీఓల) పనితీరుపై ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ సేవలను సకాలంలో అందించాల్సిన అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. విధులను తూతూమంత్రంగా నిర్వహిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామపంచాయతీ స్థాయిలో ప్రజలకు అవసరమైన జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఆస్తి వివరాల నిర్వహణతో పాటు అనేక అంశాల్లో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్న  పరిస్థితికి అద్దం పడుతుంది. గ్రామాల్లో ప్రభుత్వ పథకాల అమలు, రెవిన్యూ రికార్డుల నిర్వహణలో జాప్యం వహిస్తున్నట్లు ఆరోపణల వినిపిస్తున్నాయి. వారికి కేటాయించిన పంచాయతీల్లో ఉండాల్సింది పోయి ఎప్పుడు ఖమ్మం నగర కార్యాలయానికి అతుక్కొని పోయి ఉండటం మండల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో...

శిథిలావస్థ ఇంట్లోనే జీవనం.. ఆదర్శంగా కాంగ్రెస్ నేత మంకెన వాసు జీవనశైలి!

చిత్రం
  ఒడిదుడుకులు ఎదురైనా కాంగ్రెస్‌ను వీడని నిబద్ధత. రాజకీయ సంబంధాలను వ్యక్తిగత ఆర్థిక ఎదుగుదలకు ఉపయోగించుకోని వైఖరి కులమతాలకు అతీతంగా ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి కృషి   రాజకీయాల్లో పదవులు పరిచయాలు పెరిగితే ఆ తర్వాత వారి జీవిత శైలే మారిపోతుంది. వాటితో ఆర్థికంగా బలపడటంతో పాటు ఆడంబర జీవితాన్ని అనుభవిస్తుంటారు. కానీ కాంగ్రెస్ నాయకుడు మంకెన శ్రీనివాసరావు అలియాస్ మంకెన వాసు. నాలుగు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని, గ్రామస్థాయి కార్యకర్త నుంచి జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడి స్థాయికి ఎదిగినా నేటికీ వందేళ్ల నాటి శిథిలావస్థలో ఉన్న పెంకుటింట్లోనే నివసిస్తున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పరిచయాలు ఉన్నా వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాల కంటే పార్టీ, ప్రజా సేవకే ప్రాధాన్యతనిస్తూ సాగుతున్న ఆయన రాజకీయ ప్రస్థానంపై ప్రజాపక్షం ప్రత్యేక కథనం. ప్రజాపక్షం/కూసుమంచి: సర్పంచి స్థాయి నుంచి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడి వరకు 1995లో ముత్యాలగూడెం గ్రామ సర్పంచిగా బాధ్యతలు చేపట్టిన మంకెన వాసు, గ్రామస్థాయి రాజకీయాల్లో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. అనంతరం సహకార సంఘం ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు, వ...

పట్టభద్రుల ఓటు నమోదు ప్రక్రియ వేగవంతం

చిత్రం
  ఇంటింటికీ వెళ్లి ఓటు నమోదు చేయిస్తున్న కాంగ్రెస్ నాయకులు ప్రజాపక్షం/ ఖమ్మం రూరల్:  రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఆదేశాలు, వార్డు కౌన్సిలర్ సూచనల మేరకు ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డులో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేశారు. రెండో వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏనుగు మహేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఇంటింటికీ వెళ్లి పట్టభద్రుల ఓటు నమోదుపై అవగాహన కల్పిస్తూ, అర్హులైన పట్టభద్రులతో ఆదివారం ఓటు నమోదు చేయించారు.  ఈ సందర్భంగా పట్టభద్రులందరూ ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తించి, నిర్ణీత గడువులోగా తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలకుర్తి రామారావు, దోసపాటి లింగయ్య, కందుల బాబు, వల్లెబోయిన శ్రీను, రమేష్, వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా శ్రీ కృష్ణ సేవా ఫౌండేషన్ అనాథ ఆశ్రమం ప్రారంభం

చిత్రం
   అనాథలు, అభాగ్యులకు అండగా నిలవడమే లక్ష్యం: చైర్మన్ డాక్టర్ పాలకుర్తి కృష్ణ ప్రజాపక్షం/ఖమ్మంరూరల్: సమాజ సేవ, దానధర్మాలే ధ్యేయంగా సాయి గణేష్ నగర్ రోడ్ నంబర్ 12లో ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణ సేవా ఫౌండేషన్ అనాథ ఆశ్రమాన్ని ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ పాలకుర్తి కృష్ణ ఆధ్వర్యంలో స్థానిక కాళీకామాత ఆలయం వద్ద నిర్వహించిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, ఫౌండేషన్ సభ్యులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ పాలకుర్తి కృష్ణ మాట్లాడుతూ.. వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చి మతిస్థిమితం కోల్పోయి, కనీసం తాగునీరు, ఆహారం కూడా అందక మురికి కాలువల వద్ద దుర్భర జీవితం గడుపుతున్న అనాథలు, అభాగ్యులకు ఆశ్రమం ఆశ్రయం కల్పిస్తుందని తెలిపారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థ సేవా భావంతో ఫౌండేషన్ పనిచేస్తుందని పేర్కొన్నారు.  ప్రజల్లో మానవత్వం, సేవాభావం పెంపొందించాలని, మదర్ థెరిసా వంటి మహనీయులను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ సామాజిక సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనాథలు, అభాగ్యులు లేని జిల్లాగా ఖమ్మంను ...

రోడ్డు పనులపై ముష్టికుంట్ల రైతుల అభ్యంతరం!

చిత్రం
    రూ.5.50 కోట్ల అభివృద్ధి పనుల్లో భూములు కోల్పోతామంటూ ఆందోళన  ఇరువైపులా సమానంగా పనులు చేపట్టాలి  ఏఐకేఎస్ మండల అధ్యక్షులు కొంగర భాస్కరరావు  ప్రజాపక్షం/బోనకల్: మండలంలోని ముష్టికుంట్ల–గార్లపాడు రహదారి అభివృద్ధి పనులపై ముష్టికుంట్ల రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రహదారిని ఇరువైపులా సమానంగా విస్తరించాల్సి ఉండగా, ఒకవైపు ఉన్న తమ వ్యవసాయ భూములను రోడ్డు నిర్మాణంలో కలిపేస్తున్నారని ఆరోపిస్తూ పనులను అడ్డుకున్నారు. ఈ రహదారి అభివృద్ధికి ప్రభుత్వం రూ.5.50 కోట్ల నిధులు కేటాయించింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా పనులకు శంకుస్థాపన జరిగింది. రహదారి పూర్తయితే రైతులకు రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు మెరుగైన కనెక్టివిటీ లభించనుంది. ఈ సందర్భంగా ఏఐకేఎస్ మండల అధ్యక్షులు కొంగర భాస్కరరావు రైతుల అభ్యంతరాలను ప్రస్తావిస్తూ, రహదారి విస్తరణలో రైతులకు నష్టం కలగకుండా ఇరువైపులా సమానంగా పనులు చేపట్టాలని కోరారు. అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

చిరునోములలో ఆగని అక్రమ ఎర్రమట్టి దందా!

చిత్రం
అధికారులకు సమాచారం ఇచ్చినా ఆగని ట్రాక్టర్లు.. అసైన్డ్ భూముల నుంచి యథేచ్ఛగా తరలింపు   సెలవు రోజులను ఆసరాగా చేసుకొని జోరుగా తవ్వకాలు  మైనింగ్, రెవెన్యూ శాఖల పర్యవేక్షణ ఏదీ?  ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నా పట్టించుకోరా? ప్రజాపక్షం/బోనకల్: మండలంలోని చిరునోమల గ్రామంలో ఎర్రమట్టి అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆదివారం సెలవు దినాన్ని ఆసరాగా చేసుకొని జేసీబీలతో అసైన్డ్ భూముల నుంచి ఎర్రమట్టిని తవ్వి ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ వ్యవహారం కొనసాగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు మట్టి తవ్వకాలు, రవాణా కొనసాగినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్నారని, దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడటంతో పాటు గ్రామీణ రహదారులపై దుమ్ము, ధూళితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు సమాచారం అందించినప్పటికీ ట్రాక్టర...

ప్రభుత్వ పథకాలు కాంగ్రెస్ పార్టీ ఆస్తులు కావు!

చిత్రం
  అర్హులైన పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించాలి.. రాజకీయ వివక్షకు స్వస్తి పలకాలి ప్రభుత్వ కార్యక్రమాలు తమ పార్టీ కార్యక్రమాలు కావనే విషయాన్ని గుర్తు ఎరగాలి ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లలో అన్యాయంపై సీపీఐ జిల్లా సమితి సభ్యుడు ఉన్నం రంగారావు ఆగ్రహం ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ప్రభుత్వ పథకాలు కాంగ్రెస్ పార్టీ ఆస్తులు కావని, ప్రజాధనంతో అమలవుతున్న సంక్షేమ పథకాలపై ఏ ఒక్క పార్టీకి గుత్తాధిపత్యం లేదని సీపీఐ జిల్లా సమితి సభ్యుడు ఉన్నం రంగారావు స్పష్టం చేశారు.ఆదివారం ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్ క్రాస్ రోడ్‌లోని సీపీఐ కార్యాలయంలో ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మం రూరల్ మండల సీపీఐ జిల్లా సమితి సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హతే ప్రామాణికంగా ఉండాలని, రాజకీయ అనుబంధం ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయడం సరికాదన్నారు. పార్టీ జెండాలు మోసిన వారికే ప్రాధాన్యత ఇస్తూ, ఏళ్లుగా సొంత ఇల్లు లేక నిరుపేదలుగా జీవిస్తున్న కుటుంబాలకు అన్యాయం చేస్తున్నారంటూ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్లే ఓట్లు వేస్తే ప్రభుత్వం ఏర్పడలేదని, ప్రజల ఓట...